MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్‌ రిజెక్ట్ చేస్తే, సల్మాన్‌ ఖాన్‌ ఓకే చెప్పాడు.. స్టార్‌ డైరెక్టర్‌ ప్లాన్‌ వేరే లెవల్‌

అల్లు అర్జున్‌ రిజెక్ట్ చేస్తే, సల్మాన్‌ ఖాన్‌ ఓకే చెప్పాడు.. స్టార్‌ డైరెక్టర్‌ ప్లాన్‌ వేరే లెవల్‌

అల్లు అర్జున్‌ ఆ సంచలన స్టార్‌ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. కానీ అనూహ్యంగా ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. దీంతో సల్మాన్‌ వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం విశేషం.    

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 17 2024, 08:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో `పుష్ప 2` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ మూవీ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనంతరం బన్నీకి రెండు ఆప్షన్‌ ఉన్నాయి. అందులో ఒకటి స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ, అలాగే `యానిమల్‌` ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా. ఇద్దరిలో అట్లీతో ముందుంటుందనే ప్రచారం జరిగింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Atlee

Atlee

దర్శకుడు అట్లీ `రాజా రాణి` చిత్రంతోనే దర్శకుడిగా మెప్పించాడు. కొత్త రకమైన స్టోరీని సరికొత్తగా చెప్పి ఆకట్టుకున్నాడు. అనంతరం థళపతి విజయ్‌ తో వరుసగా `థెరి`, `మెర్సల్‌`, `బిగిల్‌` చిత్రాలు చేసి హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టి స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. ఈ క్రమంలో ఆయన అసలైన సంచలనానికి తెరతీశారు. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ షారూఖ్‌ ఖాన్‌తో సినిమా చేశారు. `జవాన్‌` మూవీతో గతేడాది ఆయన ఎలాంటి సంచలనాలు సృష్టించారో తెలిసిందే. ఇండియన్‌ బాక్సాఫీసుకు పూనకాలు తెప్పించారు. బాలీవుడ్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాన్ని అందించారు. ఇది వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని కొల్లగొట్టడం విశేషం. 

35

ఈ క్రేజ్‌తో మరో క్రేజీ స్టార్‌తో సినిమాని ప్రకటించారు. తెలుగులో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. గీతా ఆర్ట్స్ లో ఈ మూవీని అధికారికంగానూ ప్రకటించారు. బన్నీ నెక్ట్స్ మూవీ అట్లీతోనే అని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ క్యాన్సిల్‌ అంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఈ సినిమాకి అట్లీ భారీపారితోషికం అడిగారట. సుమారు 80కోట్లు ఆయన డిమాండ్‌ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో అల్లు అరవింద్‌ సినిమానే పక్కన పెట్టారని సమాచారం. ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

45
atlee

atlee

ఈ నేపథ్యంలో అట్లీ మరో ప్రాజెక్ట్ ఓకే అయ్యిందట. ఆయన బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌తో సినిమా ఫైనల్‌ అయ్యిందని తెలుస్తుంది. అట్లీ బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కి కథ చెప్పారట. ఆయన్నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందట. ప్రస్తుతం ఈ మూవీ ఓకే అయ్యిందని, నెక్ట్స్ ఈ సినిమానే ప్రారంభం కానుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త ఇటు కోలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌ లో చక్కర్లు కొడుతుంది. బన్నీ నో చెబితే సల్మాన్‌ ఎస్‌  చెప్పాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సల్మాన్‌ `సికిందర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.
 

55

ఇక అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`లో బిజీగా ఉన్నారు. ఆగస్ట్ 15న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడుతుందనే ప్రచారం సాగుతుంది. డిసెంబర్‌లో వచ్చేఅవకాశం ఉందట. షూటింగ్‌ డిలే కారణంగా వాయిదా అనుకుంటున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు నెక్ట్స్ సందీప్‌ రెడ్డి వంగాతోనూ ఓ సినిమా ఉంది. సందీప్‌ ఇప్పుడు ప్రభాస్‌తో `స్పిరిట్‌`ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ మూవీ స్టార్ట్ కాబోతుంది. ఈమూవీ అయిపోయాక బన్నీతో సినిమా చేయనున్నారు సందీప్‌ రెడ్డి వంగా. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Recommended image2
Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు
Recommended image3
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved