MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas Next Film: సంచలన దర్శకుడితో ప్రభాస్‌ సినిమా.. చరిత్ర సృష్టించేందుకు రంగం సిద్ధం

Prabhas Next Film: సంచలన దర్శకుడితో ప్రభాస్‌ సినిమా.. చరిత్ర సృష్టించేందుకు రంగం సిద్ధం

`ధురంధర్‌`, `ధురంధర్‌ 2` సినిమాల రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్ తర్వాత, డైరెక్టర్ ఆదిత్య ధర్ ఇప్పుడు ప్రభాస్‌తో ఒక కొత్త పాన్-ఇండియా సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజున ఈ ప్రాజెక్ట్‌పై పెద్ద ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

1 Min read
Author : Aithagoni Raju
Published : Jul 11 2026, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
భారీ పాన్‌ ఇండియా చిత్రాలతో ప్రభాస్‌ బిజీ
Image Credit : Asianet News

భారీ పాన్‌ ఇండియా చిత్రాలతో ప్రభాస్‌ బిజీ

ప్రభాస్‌.. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌. ఆయన పేరుతో వేల కోట్ల బిజినెస్‌ జరుగుతుందంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రభాస్‌ `ఫౌజీ`, `స్పిరిట్‌`, `కల్కి 2` చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతోపాటు `సలార్‌ 2` మూవీ చేయాల్సి ఉంది. హోంబలే ఫిల్మ్స్‌తో మరో రెండు పెద్ద సినిమాలకు ప్రభాస్ డీల్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమాకి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌తో ఆయన మూవీ చేయబోతున్నారట. ఆయనే `ధురంధర్‌` డైరెక్టర్‌ ఆదిత్య ధర్‌. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆదిత్య ధర్‌తో ప్రభాస్‌ మూవీ
Image Credit : instagram

ఆదిత్య ధర్‌తో ప్రభాస్‌ మూవీ

`ధురంధర్‌`, `ధురంధర్‌ 2` సినిమాలతో ఆదిత్య ధర్‌ ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేశారో తెలిసిందే. రెండో భాగంగా ఏకంగా రూ.1800కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఈ సినిమాలతో సరికొత్త చరిత్ర సృష్టించిన డైరెక్టర్ ఆదిత్య ధర్  ప్రభాస్‌తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారట. అయితే ముందు రణ్‌వీర్‌ సింగ్‌తోనే సినిమా ఉంటుందని భావించారు, కానీ  ఇటీవలే హైదరాబాద్‌లో ఆదిత్య ధర్, ప్రభాస్‌ను కలిశారని  వార్తలొస్తున్నాయి. ఆయన ప్రభాస్‌కు తన కొత్త సినిమా కథను వినిపించారట. కథాంశం ప్రభాస్‌కు బాగా నచ్చిందని, ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని సమాచారం. అయితే, మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

33
సరికొత్త చరిత్ర కి శ్రీకారం.. ప్రకటన వచ్చేది అప్పుడే
Image Credit : instagram

సరికొత్త చరిత్ర కి శ్రీకారం.. ప్రకటన వచ్చేది అప్పుడే

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రకటన అక్టోబర్ 23న, అంటే ప్రభాస్ పుట్టినరోజున రావచ్చు. గతంలో కూడా ప్రభాస్ పుట్టినరోజున ఆయన సినిమాల పోస్టర్లు, టీజర్లు విడుదలయ్యాయి. కాబట్టి ఈసారి కూడా అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ఉండొచ్చని ఆశిస్తున్నారు. నిజంగానే ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితే ఈ మూవీ సరికొత్త చరిత్ర కి శ్రీకారం చుట్టబోతుందని చెప్పొచ్చు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan-Singeetam Movie: జీసస్‌ కథతో పవన్‌ కళ్యాణ్‌ మూవీ.. సింగీతంతో చేయాల్సిన సినిమా ఎలా ఆగిపోయింది?
Recommended image2
Singeetham Top 10 Movies: సినిమా సైంటిస్ట్.. సింగీతం శ్రీనివాసరావు టాప్ 10 క్లాసిక్ మూవీస్, మయూరి నుంచి భైరవ ద్వీపం వరకు..
Recommended image3
Motivational Song: జీవితం అంటే కేవలం బతకడం కాదు.. జీవిత స‌త్యాన్ని చాటే సిరివెన్నెల పాట
Related Stories
Recommended image1
Ramya Krishnan: సీఎంగా మారిన రమ్యకృష్ణ.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో `క్వీన్‌` సంచలనం
Recommended image2
Lenin: లెనిన్‌ రిజల్ట్ పై నాగార్జున ఫస్ట్ రియాక్షన్‌, అది మాకు భయంకరమైన టైమ్‌, అఖిల్‌ చాలా మారిపోయాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved