- Home
- Entertainment
- సిద్ధార్థ్‌ని కాదని సీనియర్ హీరోకి ప్రపోజ్ చేసిన అదితి రావు హైదరీ.. ప్రియుడి రియాక్షన్ ఏంటంటే?
సిద్ధార్థ్‌ని కాదని సీనియర్ హీరోకి ప్రపోజ్ చేసిన అదితి రావు హైదరీ.. ప్రియుడి రియాక్షన్ ఏంటంటే?
అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ కలిసి ఇటీవల చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆ మధ్య శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌కి కూడా ఇద్దరు కలిసే వచ్చారు. కానీ సిద్ధార్థ్ వాలెంటైన్స్ డే సందర్భంగా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.

హాట్ హీరోయిన్ అదితిరావు హైదరీ ప్రేమికుల రోజు సందర్భంగా తన ప్రియుడికి పెద్ద షాకిచ్చింది. హీరో సిద్ధార్థ్, అదితి ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రియుడికి లవ్ ప్రపోజ్ చేస్తారు. కానీ అదితి మాత్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఆయన్ని కాదని మరో సీనియర్ హీరోకి ప్రపోజ్ చేయడం విశేషం.
తాజాగా అదితిరావు హైదరీ.. బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్రకి ఆమె వాలెంటైన్స్ డే విషెస్ తెలియజేయడం విశేషం. అంతేకాదు ది మోస్టెస్ట్... హ్యాండ్సమ్ అంటూ పేర్కొంది. ఆయనకు రోజా పువ్వుని ఇస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది అదితిరావు హైదరీ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఓ షోలో పాల్గొన్నసమయంలో అదితి ఇలా తన ఫేవరేట్, అభిమాన హీరోపై ప్రేమని ఈ విధంగా వెల్లడించిందని చెప్పొచ్చు. దీంతో ప్రియుడు సిద్ధార్థ్ ని కాదని, సీనియర్ హీరోకి లవ్ ప్రపోజ్ చేయడం పట్ల హాట్ హాట్ చర్చ నడుస్తుంది. నెటిజన్లు అనేక అర్థాలు, పరమార్థాలు తీస్తూ,సెటైర్లు పేలుస్తున్నారు. కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ప్రేమికుల రోజు ప్రియుడికి షాక్, బాయ్‌ఫ్రెండ్‌కి షాకిచ్చిందంటూ రచ్చ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ పోస్ట్ పై హీరో సిద్ధార్థ్ స్పందించడం విశేషం. తాను కూడా రెండు లవ్ ఎమోజీలను పంచుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన చాలా కూల్‌గా లైట్‌గా తీసుకున్నారని చెప్పొచ్చు. అయితే అదితి ప్రపోజల్‌లో పెద్దగా తప్పులేకపోయినా, ప్రేమికుల రోజు ప్రియుడితో కాకుండా మరో హీరోకి పువ్వు ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుందంటున్నారు నెటిజన్లు.
సిద్ధార్థ్, అదితి రావు హైదరీ ఆ మధ్య `మహాసముద్రం` అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ రొమాంటిక్ డ్రామా చిత్రంలో ఈ ఇద్దరు లవర్స్ గా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అది ఇప్పుడు బలపడిందని అంటున్నారు. పలు సందర్భాల్లో ఈ జంట కలిసే తిరుగుతూ కనిపించారు. ఇటీవల శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌లోనూ కలిసి రావడం, కలిసి ఫోటోలకు పోజులివ్వడంతో తమ రిలేషన్‌షిప్ ని బహిర్గతం చేశారు. రూమర్స్ ని కన్ఫమ్ చేశారు. ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట పెళ్లి వరకు వెళ్తారా? అనేదిచూడాలి.
నిజానికి అదితి రావు హైదరీకి ఎప్పుడో పెళ్లయ్యింది. తక్కువ ఏజ్‌లోనే సత్యదేవ్ మిశ్రా అనే వ్యాపారవేత్తని మ్యారేజ్ చేసుకున్నారు. కానీ ఎప్పుడూ ఆ విషయాన్ని బయటపెట్టలేదు. సీక్రెట్‌గానే ఉంచారు. ఆ తర్వాత కొన్నాళ్లకి విడిపోయినట్టు వెల్లడించారు. ఆ తర్వాత సింగిల్‌గానే ఉంటున్న అదితి ఇప్పుడు సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం అదితి `గాంధీ టాక్స్` అనే సైలెంట్ మూవీ, రెండు వెబ్ సిరీస్ లు చేస్తుంది. సిద్ధార్థ్ `ఇండియన్ 2`లో కీలక పాత్రలో నటిస్తున్నారు.