- Home
- Entertainment
- జబర్దస్త్ కమెడియన్లు కోట్లు పోగేసుకుంటున్నారా ? ఆ సీక్రెట్ అదా, చైతన్య మాస్టర్ మృతిపై అదిరే అభి కామెంట్స్
జబర్దస్త్ కమెడియన్లు కోట్లు పోగేసుకుంటున్నారా ? ఆ సీక్రెట్ అదా, చైతన్య మాస్టర్ మృతిపై అదిరే అభి కామెంట్స్
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ మృతితో బుల్లితెరపై ఆర్టిస్టులకు ఇచ్చే రెమ్యునరేషన్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ మృతితో బుల్లితెరపై ఆర్టిస్టులకు ఇచ్చే రెమ్యునరేషన్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఢీ లాంటి పాపులర్ డ్యాన్స్ షోతో గుర్తింపు పొందిన చైతన్య మాస్టర్ మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణం అని ప్రచారం జరిగింది.
మరణించే ముందు సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో ద్వారా చైతన్య మాస్టర్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక పోతున్నాననే మానసిక ఒత్తిడిలో ఆయన ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఢీ షోకి గాను తనకి సరైన రెమ్యునరేషన్ ఇవ్వలేదని చైతన్య మాస్టర్ తన సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఢీ కంటే జబర్దస్త్ లో చేసే వారికే ఎక్కువ రెమ్యునరేషన్ వస్తోందని వాపోయారు.
దీనితో చైతన్య మాస్టర్ చేసిన వ్యాఖ్యలతో టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ మొదలైంది. బుల్లితెర ఆర్టిస్టులకు నిజంగానే సరైన పారితోషికం అందడం లేదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై జబర్దస్త్ షోతో గుర్తింపు పొందిన ప్రముఖ కమెడియన్ అదిరే అభి అభిమానులు, ఇండస్ట్రీకి రావాలని ఆశపడుతున్నవారికి వీడియో రూపంలో సందేశం ఇచ్చారు. ఎందుకు జబర్దస్త్ లాంటి షోలో రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తారో వివరించారు.
సినిమా, టివి రంగంలో బాగా సెటిలైన కొందరిని చూసి ఇన్స్పైర్ అయి తాము కూడా ఇండస్ట్రీకి వెళ్లాలని చాలా మంది భావిస్తుంటారు. కాబట్టి ఒకస్థాయిలో ఉన్నమనం ఏం చేసినా ఆ ప్రభావం తర్వాతి తరంపై పడుతుంది అని అదిరే అభి అన్నారు. ఇండస్ట్రీకి వచ్చే ముందు మనం ఇక్కడ పరిస్థితితులని అవగాహన చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి పరిస్థితులని అయినా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుంది.
ఇక్కడికి రాగానే ఎర్రతివాచీ వేసి స్వాగతం పలుకుతారు, ఆఫర్లు వస్తాయి.. కోట్లల్లో డబ్బు సంపాదించవచ్చు అని భావిస్తే పొరపాటే. కడుపు మాడ్చుకుని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినా కూడా సక్సెస్ వస్తుంది అని చెప్పలేం.. వచ్చినా దాన్ని కొనసాగించడం కూడా పెద్ద సవాలే. ఇండియన్ సినిమాలోనే నంబర్ వన్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు నిర్మాతగా వందల కోట్లు పోగొట్టుకున్నారని తెలుసా? ఆస్తులు కూడా అమ్మేయాల్సిన పరిస్థితి.. కానీ ఆయన కౌన్ బనేగా కరోడ్ పతి షో ప్రారంభించి తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యారు. అమితాబ్ స్టార్ కావడం వల్ల అలా జరగలేదు.. పరిస్థితులని అర్థం చేసుకున్నారు కాబట్టి మరోసారి సక్సెస్ అయ్యారు.
అందుకే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా కనకంటూ ప్లాన్ బి ఉండాలి. వచ్చిన మొత్తని సేవ్ చేసుకోవాలి. పరిస్థితులకు కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు అంటూ అదిరే అభి చైతన్య మాస్టర్ మృతిపై కామెంట్స్ చేశారు. అయితే జబర్దస్త్ లాంటి షోలలో ఆర్టిస్టులు కోట్లల్లో గడిస్తున్నారనే ప్రచారం ఉంది. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను లాంటి వారు ఖరీదైన ఫ్లాట్లు కొన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
జబర్దస్త్ షో రెమ్యునరేషన్ గురించి అదిరే అభి మాట్లాడుతూ.. ఆ షోకి రేటింగ్ ఎక్కువ కాబట్టి పారితోషికం కూడా ఎక్కువగానే ఉంటుంది. రేటింగ్ ఎక్కువ ఉన్న షోలకు సహజంగానే రెమ్యునరేషన్ కూడా అలాగే ఉంటుంది. అయినా చాలా మంది జబర్దస్త్ కమెడియన్లు బాగా సంపాదిస్తున్నారు అంటే షో ఒక్కటే కారణం కాదు.. వీలు చిక్కినప్పుడు వాళ్ళు ప్రయివేట్ ప్రోగ్రామ్స్, షోలు చేస్తుంటారు. అలా వారి సంపాదన పెంచుకుంటారు అని అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.