తన కొడుకును పరిచయం చేసిన త్రిష.. ట్విస్ట్ ఏంటంటే? వైరల్ గా మారిన ఫొటోస్..
స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) తాజాగా పంచుకున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. చంటిపిల్లాడిని ఎత్తుకొని త్రిష పంచుకున్న పిక్స్ ఆసక్తికరంగా మారాయి. నెటిజన్లు తమ అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్లో కొన్నాళ్ల పాటు ఊపూపింది త్రిష. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. వరుస చిత్రాలతో కోలీవుడ్ లో సందడి చేస్తున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో త్రిష యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ వస్తున్నారు. తన సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా త్రిష పంచుకున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.
ప్రస్తుతం త్రిష ‘ది రోడ్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. అరుణ్ వసీగరన్ దర్శకుడు. ప్రముఖ తమిళ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా త్రిష పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. అయితే తాజాగా త్రిష ఈ చిత్ర సెట్స్ నుంచి కొన్ని ఫొటోలను పంచుకుంది.
చంటిబిడ్డను ఎత్తుకొని త్రిష మురిసిపోతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ క్యూట్ పిక్స్ ను చూసిన నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. త్రిషకు కూడా పెళ్లి అయ్యి ఉంటే ఇలానే ఉండేవాడోమో అని అభిప్రాయపడుతున్నారు. కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
అయితే సెట్స్ నుంచి ఇలాంటి ఫొటోలను పంచుకోవడంతో.. తల్లిగా త్రిష అలరించబోతుందని అంటున్నారు. నాలుగు పదుల వయస్సు వచ్చిన త్రిష ఇంకా బ్యాచిలర్ లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉన్నారు. కేవలం కేరీర్ పైనే ఫోకస్ పెట్టినట్టు ఇంటర్వ్యూల్లో తెలిపారు.
చివరిగా ‘పొన్నియిన్ సెల్వన్ 2’తో అలరించింది. కుందవైగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం త్రిష చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. మలయాళంలో `రామ్`, విజయ్ సరసన `లియో`, `సథురంగ వెట్టై 2`తో పాటు `ది రోడ్` వంటి సినిమాల్లో నటిస్తున్నారు. నెక్ట్స్ The Roadతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. అలాగే ‘లియో’లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.