నటి తాప్సీ ఫైర్.. ఎందుకలా అరుస్తున్నారు.. ఎప్పుడూ మాదే తప్పా.. వైరల్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee Pannu) తాజాగా ఫొటోగ్రాఫర్స్ పై విరుచుకుపడింది. ‘దోబారా’ చిత్ర ప్రమోషన్స్ లో ఉన్న ఈ బ్యూటీకి.. ఫొటోగ్రాఫర్స్ కు మధ్య వాగ్వాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సొట్టబుగ్గల సుందరిగా టాలీవుడ్‌కి పరిచయం అయిన తాప్సీ పన్ను.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్ సరసన ‘ఝుమ్మంది నాదం’లో నటించి గ్లామర్ పరంగా, నటన పరంగా తెలుగు ఆడియెన్స్ తో ఒకే అనిపించుకుంది. సినిమాకూ మంచి రెస్పాన్స్ రావడంతో.. తాప్సీ ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను అందుకుంది.
తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన తన మార్క్ చూపించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైంది. కొన్నేండ్లుగా హిందీ చిత్రాల్లోనే నటిస్తూ నార్త్ అక్కడే పాతుకుపోయింది. నార్త్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈ సొట్టబుగ్గల చిన్నది రీసెంట్ గా ‘శభాష్ మిథు’ చిత్రంతో అలరించింది. ప్రముఖ లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
తాజాగా మరోచిత్రం ‘దోబారా’ (Dobaaraa)తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 19న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాప్పీ పన్ను, చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ కోసం హాజరైన తాప్సీకి.. ఫొటోగ్రాఫర్స్ కు మధ్య కాస్తా వాగ్వివాదం జరిగింది. దీంతో తాప్సీ వారిపై ఫైర్ అయ్యింది.
అయితే అప్పటికే తాప్పీ కోసం ఎదురుచూస్తున్న ఫొటోగ్రాఫర్స్ ఏమాత్రం సమయం ఇవ్వకుండా.. వారిని పట్టించుకోకుండా స్టూడియోలోకి వెళ్లింది. దీంతో వారు ‘ఇప్పటికే లేట్ గా వచ్చారు. కాస్తా ఆగి వెళ్లండి మేడం.. మేం రెండు గంటలుగా ఎదురుచూస్తున్నాం’ అంటూ బిగ్గరగా అరిచారు. తాప్సీ తిరిగి వచ్చాక వారితో మాట్లాడే క్రమంలో ఫైర్ అయ్యింది.
‘నేనేమీ లేట్ గా రాలేదు. నా సమయానికే వచ్చాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. వీరెందుకలా బిగ్గరగా అరుస్తున్నారు. మీరేం అరిచినా అది తప్పుకాదు.. ఎప్పుడూ కెమెరాలు నటీనటులపైనే ఉంటాయి కాబట్టి మాదే తప్పు అవుతుంది’ అంటూ కాస్తా గరం అయ్యింది. తర్వాత సమస్య సద్దుమణగడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.
తాప్సీ ప్రతి అంశాన్ని తన సినిమాకు ప్రమోషన్ గానే వాడుకుంటోంది. ఇప్పటికే ‘కాఫీ విత్ కరణ్’ షోలో తన సెక్స్ లైఫ్ గురించి అదిరిపోయే ఆనర్స్ ఇచ్చి ఇంటర్నెట్ లో ట్రెండ్ అయ్యింది. తాజాగా ఇలా ఫొటోగ్రాఫర్స్ తో మాట్లాడిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.