- Home
- Entertainment
- డబ్బున్నోళ్లతో సురేఖావాణి ఎఫైర్స్, సినిమాలు లేకున్నా లగ్జరీ లైఫ్... ఓపెన్ అయిన లేడీ కమెడియన్!
డబ్బున్నోళ్లతో సురేఖావాణి ఎఫైర్స్, సినిమాలు లేకున్నా లగ్జరీ లైఫ్... ఓపెన్ అయిన లేడీ కమెడియన్!
నటి సురేఖావాణి ఈ మధ్య సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం లేదు. అయితే తరచుగా వార్తల్లో నిలుస్తుంది. అయితే లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న సురేఖావాణి డబ్బున్నోళ్లతో అఫైర్స్ పెట్టుకుందనే వాదన ఉంది. దీనిపై ఆమె స్వయంగా స్పందించారు.

సురేఖావాణి కెరీర్ యాంకర్ గా మొదలైంది. మొదట్లో ఆమె మా టీవీలో పనిచేసింది. అనంతరం సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేసింది. సపోర్టింగ్, క్యారెక్టర్ రోల్స్ చేసింది. శ్రీను వైట్ల సినిమాల్లో చేసిన కామెడీ రోల్స్ ఆమెకు పాపులారిటీ తెచ్చాయి.
భర్త మరణంతో సురేఖావాణి కొన్నాళ్ళు నటనకు దూరమైంది. తర్వాత లాక్ డౌన్ వచ్చింది. లాంగ్ గ్యాప్ రావడంతో సురేఖావాణిని దర్శక నిర్మాతలు, ప్రేక్షకులు మర్చిపోయారు. నాకు ఆఫర్స్ ఇవ్వడం లేదంటూ ఆ మధ్య ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో సురేఖావాణి ఆవేదన వ్యక్తం చేసింది.
సినిమాల్లో అరుదుగా కనిపిస్తున్న సురేఖావాణి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. అభిమానులకు ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటుంది. సదరు ఫోటోల్లో సురేఖావాణి విలాసాలు చూసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బడా బాబులతో అఫైర్స్ పెట్టుకున్న సురేఖావాణి లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది. చేతిలో సినిమాలు కూడా లేవు, ఆమెకు డబ్బులు ఎక్కడివి అని ప్రశ్నిస్తున్నారు.
ఈ విమర్శలపై స్పందించిన సురేఖావాణి... నేను తెలుగులో సినిమాలు చేయకపోయినా, తమిళంలో చేస్తున్నాను. ఆ విధంగా సర్వైవ్ అవుతున్నాను. నా ముఖం, డ్రెస్సింగ్ లో రిచ్ నెస్ కనిపిస్తుంది. అందుకే కొందరికి అలాంటి భావన కలుగుతుందని సురేఖావాణి అన్నారు.
Tollywood Drug Case-Surekhavani
సురేఖావాణి మీద డ్రగ్స్ ఆరోపణలు రాగా, ఈ విషయం మీద కూడా ఆమె స్పందించారు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. ఇంట్లో కూర్చుని ఏడ్చాను. కూతురు తనకు సపోర్ట్ గా నిలిచిందని సురేఖావాణి అన్నారు. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్ కేసులో అరెస్ట్ కాగా... సురేఖావాణి, అషురెడ్డి పేర్లు వినిపించాయి.
ఆమె ఇంకా మాట్లాడుతూ భర్త మరణం నన్ను కృంగదీసింది. డిప్రెషన్ లోకి వెళ్ళాను.ఆ బాధ నుండి బయటపడేందుకు కూతురు సహాయం చేసింది. రెండో పెళ్లి ఆలోచన లేదు. రిలేషన్స్ పై నమ్మకం లేదు. చనిపోయిన నా భర్త కనీసం కలలోనైనా ఒకసారి కనిపిస్తే చూడాలని ఉంది... అంటూ సురేఖావాణి చెప్పుకొచ్చింది.
కాగా ఇటీవల సురేఖావాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా ఒక మూవీ మొదలైంది. ఈ చిత్రంలో హీరోగా బిగ్ బాస్ 7 ఫేమ్ అమర్ దీప్ చౌదరి నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.