MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఆ యూట్యూబర్‌తో ‘రాజ రాజ చోర’ హీరోయిన్ పెళ్లి? సీక్రెట్ గా ఎంగేజ్మెంట్

ఆ యూట్యూబర్‌తో ‘రాజ రాజ చోర’ హీరోయిన్ పెళ్లి? సీక్రెట్ గా ఎంగేజ్మెంట్

 తెలుగులో పెళ్లికి ముందు ప్రేమకథ, రాజా రాజ చోర, చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్ లలో నటించిన సునయన త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. 

2 Min read
Author : Surya Prakash
Published : Jul 03 2024, 06:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘రాజ రాజ చోర’ చిత్రంలో నటించిన సునయన చాలా మందికి గుర్తుండే ఉండి ఉంటుంది. అలాగే ఆమె నటించిన రెజీనా చిత్రం, ‘ఇన్‌స్పెక్టర్ రిషి’ వెబ్ సిరీస్‌ తెలుగు ఓటిటిలలో హిట్ అయ్యాయి. . తెలుగులో హీరో శ్రీవిష్ణు సరసన రాజా రాజా చోరా చిత్రంలో నటించాక తెలుగులో వరస ఆఫర్స్ వస్తాయనుకుంది.  కానీ ఆ అనుకున్నట్లుగా  అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళంలో  బిజీగా ఉంది. తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే  సునయన పర్సనల్ లైఫ్ గురించి తమిళ సినీ వర్గాల్లో  ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


తమిళంలో వరస సినిమాలు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సునయన ..రహస్యంగా నిశ్చితార్దం చేసుకుంది. కేవలం ఎంగేజ్మెంట్ రింగ్ చూపుతూ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. అయితే ఆమె ఎంత సీక్రెట్ గా విషయాన్ని ఉంచినా, ఆ పెళ్లి కొడుకు ఎవరో తెలిసిపోయింది.
 

38


సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ప్రాజెక్టులు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది సునయన. ఓ రకంగా అవి ఆమె ప్రాజెక్టులకు పబ్లిసిటిగా కూడా పనికొస్తూంటాయి. మధ్య మధ్యలో తన పర్శనల్ విషయాలు షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూంటుంది. అవి వైరల్ అవుతూంటాయి కూడా. అలాగే రీసెంట్ గా  తను ఒక వ్యక్తి చేతులు పట్టుకున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలో కేవలం వారిద్దరి చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. 

48


ఈ ఫొటో చూసిన వాళ్లు ఆమెకు  ఎంగేజ్‌మెంట్ అయ్యిందని అర్థం చేసుకున్నారు. అయితే ఎవరితో ఆమె ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎవరా లక్కీ గై అనే విషయాలు డిస్కషన్ మొదలైంది. రకరకాల ఆప్షన్ తో జనం కామెంట్స్ చేస్తన్నారు. కొందరైతే ఇది ఆమె కొత్త చిత్రానికి సంభందించిన థీమ్ అయ్యిండవచ్చు అని తేల్చేసారు.  ఇలా తన అభిమానులు అంతా ఈ విషయంలో కన్‌ఫ్యూజన్‌లో ఉండగా.. వెంటనే దీనిపై క్లారిటీ ఇచ్చింది సునయన. 

58


‘‘నా చివరి పోస్ట్ గురించి కొన్ని ఆర్టికల్స్ వైరల్ అవ్వడం నేను చూశాను. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో  తను ఎంగేజ్డ్ అని ప్రకటించింది. ఫ్యాన్స్ చేస్తున్న మెసేజ్‌లకు, విషెస్‌కు థ్యాంక్స్ చెప్పింది. ఇది తనకు చాలా పెద్ద విషయమని  చెప్పుకొచ్చింది సునయన. దీంతో అసలు తను ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడం మొదలుపెట్టారు నెటిజన్లు. 

68


 ఈ క్రమంలో ఆమెతో ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తి  ఒక ఫేమస్ అరబ్ యూట్యూబర్.. అతని పేరు ఖలీద్ అల్ అమేరీ అని బయటకు వచ్చింది. ఈ వార్త రాగానే జనం  సునయన ఇనిస్ట్రా పోస్ట్ లు చేక్ చేయటం మొదలెట్టారు.  అలా చేస్తూంటే వాళ్లకు..ఆమె  సోషల్ మీడియాలో పోస్టులు అన్నింటిలో దాదాపుగా ఖలీద్ కామెంట్ ఉండటం గమనించి..కన్ఫర్మ్ చేసేసారు. 
 

78


ఇలా సునయన అభిమానులు  వీరిద్దరికే ఎంగేజ్‌మెంట్ జరిగిందని అందరూ ఫిక్స్ అయిపోతూంటే వారికి మరో క్లూ దొరికింది. సునయన ఎంగేజ్‌మెంట్ అని ఫోటో షేర్ చేసిన రోజే.. దాదాపుగా అలాంటి ఫోటోనే ఖలీద్ కూడా షేర్ చేశాడని గమనించేసారు. దాంతో వీళ్లద్దరికే ఎంగేజ్మెంట్ అయ్యిందని తేల్చేసారు. 
 

88

సునయన తమిళంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ 2008లో విడుదలైన కాదలిల్ విడుదెన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పెళ్లికి ముందు ప్రేమకథ, రాజా రాజ చోర, చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్ లలో నటించింది.  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Recommended image2
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image3
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved