- Home
- Entertainment
- అన్నయ్యతో కళ్యాణి విడిపోవడానికి కారణం అదొక్కటే.. తెలివి తక్కువ పని, నటి సుజిత కామెంట్స్ వైరల్
అన్నయ్యతో కళ్యాణి విడిపోవడానికి కారణం అదొక్కటే.. తెలివి తక్కువ పని, నటి సుజిత కామెంట్స్ వైరల్
నటి సుజిత చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు సినిమాల్లో, టివి సీరియల్స్ లో రాణిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పసివాడి ప్రాణం చిత్రంలో అత్యంత కీలకమైన మూగ అబ్బాయి పాత్రలో నటించింది సుజితనే.

నటి సుజిత చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు సినిమాల్లో, టివి సీరియల్స్ లో రాణిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పసివాడి ప్రాణం చిత్రంలో అత్యంత కీలకమైన మూగ అబ్బాయి పాత్రలో నటించింది సుజితనే. జైచిరంజీవ చిత్రంతో మెగాస్టార్ కి సోదరిగా నటించింది. ఇప్పుడు సుజిత అవకాశం ఉన్నప్పుడు సినిమాల్లో నటిస్తూనే టివి సీరియల్స్ లో రాణిస్తోంది.
నటుడు దర్శకుడు అయిన సూర్య కిరణ్.. సుజిత అన్నాచెల్లెళ్ళు. సత్యం లాంటి హిట్ చిత్రాలని సూర్యకిరణ్ తెరకెక్కించారు. ప్రముఖ హీరోయిన్ కళ్యాణిని సూర్య కిరణ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ కొంతకాలానికే వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. అయితే తన అన్నా వదినలు మధ్య ఏం జరిగింది / ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయాన్ని సుజిత రివీల్ చేసింది.
కళ్యాణికి ఒక చెల్లి ఉంటే ఎలా ఉంటుందో ఆమెతో నేను అలాగే ఉండేదాన్ని. జీవితంలో ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. కానీ వాటిని పెద్దవి చేసుకోకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ అనవసరంగా అన్నయ్య, వదిన పెద్ద పెద్ద విషయాల్లో కాలు పెట్టారు. అన్నయ్య ఏదైనా చెబితే నేను కాదనను. అడ్డు చెప్పే ధైర్యం కూడా నాకు లేదు. కానీ వారు జీవితంలో కాస్త నెమ్మదిగా అడుగులు వేసి ఉండాల్సింది.
ఒక సినిమా నిర్మిస్తున్నాను అంటే సరే అన్నాను. కానీ అది వారిని ఆర్థికంగా దెబ్బతీసింది. నాకు తెలిసి సాయం చేద్దాం అనుకునేలోపులు వారిద్దరూ చాలా డెసిషన్స్ తీసేసుకున్నారు. చాలా దూరం వెళ్లిపోయారు. వారిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలే. ఆ తర్వాత దానికి అన్ని తోడయ్యాయి అని సుజిత తెలిపింది.
అప్పుల పాలయ్యారు. కేరళలో అన్నయ్యకి అద్భుతమైన ప్రాపర్టీ ఉంది. అప్పుల వల్ల దానిని కూడా అమ్మేశారు. ఆ విషయం నాకు కూడా చాలా ఆలస్యంగా తెలిసింది. సినిమా అనేది గ్యాంబ్లింగ్. అందరికి కలసిరాదు. మనకి ఉన్న డబ్బులో కొంత మాత్రమే నిర్మాణంలో పెట్టాలి. మొత్తం పెట్టేసి పోగొట్టుకోవడం అనేది తెలివి తక్కువ పని. వాళ్లిద్దరూ విడిపోవడానికి కారణం అదే అని కళ్యాణి అన్నారు.
వాళ్లిద్దరూ విడిపోతున్నట్లు కూడా నాకు చెప్పలేదు. వారి లైఫ్ లో ఒక డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి మేం కలగజేసుకోలేదు. వారిద్దరికీ అదే కరెక్ట్ అనిపించినప్పుడు మనం ఏమీ చేయలేము అని సుజిత పేర్కొంది.