- Home
- Entertainment
- అమ్మాయిని అంత బూతు మాట అనొచ్చా.. ట్రాఫిక్ హోమ్ గార్డుపై సౌమ్య జాను మరోసారి వ్యాఖ్యలు
అమ్మాయిని అంత బూతు మాట అనొచ్చా.. ట్రాఫిక్ హోమ్ గార్డుపై సౌమ్య జాను మరోసారి వ్యాఖ్యలు
సౌమ్య జాను టాలీవుడ్ లో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేస్తూ రాణిస్తోంది. ఆమె తడాకా, చందమామ కథలు, లయన్ లాంటి చిత్రాల్లో నటించింది. సౌమ్య జాను రీసెంట్ గా తన జాగ్వార్ కారులో ప్రయాణిస్తూ రాంగ్ రూట్ లో వెళ్ళింది.

సౌమ్య జాను టాలీవుడ్ లో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేస్తూ రాణిస్తోంది. ఆమె తడాకా, చందమామ కథలు, లయన్ లాంటి చిత్రాల్లో నటించింది. సౌమ్య జాను రీసెంట్ గా తన జాగ్వార్ కారులో ప్రయాణిస్తూ రాంగ్ రూట్ లో వెళ్ళింది. దీనితో ట్రాఫిక్ హోమ్ గార్డు అడ్డుకున్నారు. వివరణ ఇచ్చుకోవడమో, ఫైన్ కట్టడమో చేయాలి. కానీ సౌమ్య జాను తప్పు చేసింది కాక ట్రాఫిక్ హోమ్ గార్డుతో నడిరోడ్డుపై రచ్చ చేసింది.
ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ట్రాఫిక్ హోమ్ గార్డు యూనిఫామ్ ని కూడా సౌమ్య జాను చించేసింది. దీనితో ఆమెపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తర్వాత సౌమ్య జాను సిటీ విడిచి పారిపోయింది అంటూ రూమర్స్ వచ్చాయి.
తాజాగా సౌమ్య ఈ సంఘటన గురించి ఓపెన్ అవుతూ తాను ఎక్కడికి పారిపోలేదని ఇక్కడే ఉన్నానంటూ యూట్యూబ్ లో ప్రత్యక్షం అయింది. హోంగార్డు తనని బూతు మాట తిట్టాడని.. ఒక అమ్మాయిని అలా ఎలా తిడుతారు అంటూ సౌమ్య జాను ఆరోపిస్తోంది. ఈ సంఘటన తర్వాత తన తన ఫ్యామిలీ నరకం అనుభవిస్తోంది పేర్కొంది. తాను కనీసం మంచి నీళ్లు కూడా తాగలేకున్నట్లు పేర్కొంది.
రాంగ్ రూట్ లో వెళ్లడం నాతప్పే. కానీ ఒక అమ్మాయి తప్పు చేస్తోందంటే అందులో కారణం ఉంటుంది. అంత మాత్రమే అంత బూతుమాట తిడతారా. ఆ మాటతోనే నాకు కోపం వచ్చింది. మా అమ్మకి అర్జెంట్ గా మెడిసిన్స్ అవసరం అని చెప్పినా వినలేదు. కారు వెనక్కి తీయమన్నాడు. చాలా అసభ్యంగా బిహేవ్ చేశాడు. ఒక అమ్మాయిని ప్రతి మగాడు ఆ బూతు మాట ఎందుకు అంటారో అర్థం కావడం లేదు.
అక్కడ నేను ఎలాంటి హంగామా చేయలేదు. కావాలంటే సిసి కెమరాలు చెక్ చేసుకోండి అని సౌమ్య జాను ఫైర్ అయింది. నా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధం. నేను మద్యం కూడా సేవించలేదు.
ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. మరో వైపు మా అమ్మకి మెడిసిన్స్ అవసరం.. అందుకే రాంగ్ రూట్ లో వెళ్ళాను అని సౌమ్య జాను చెబుతోంది. తన స్నేహితులంతా ఫోన్ చేసింది ఏంటి ఇలా జరిగింది అని అడుగుతున్నారు.