- Home
- Entertainment
- లేత గులాబీ చీరలో స్నేహా అందాలు.. ఈ వయస్సులోనూ గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తున్న హోమ్లీ బ్యూటీ!
లేత గులాబీ చీరలో స్నేహా అందాలు.. ఈ వయస్సులోనూ గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తున్న హోమ్లీ బ్యూటీ!
సీనియర్ హీరోయిన్, హోమ్లీ బ్యూటీ స్నేహా (Sneha) గ్లామర్ మెరుపులతో ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది. ఈ వయస్సులోనూ చెక్కు చెదరని అందాలతో కుర్రకారును అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా స్నేహా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ స్నేహా లేదు. స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ.. ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. దక్షిణాదిలోని అన్ని భాషా చిత్రాల్లో నటించి పాపులారిటీని సొంతం చేసుకుంది.
ఇప్పటికీ తన కేరీర్ ను జోరుగా కొనసాగిస్తున్న స్నేహా సౌత్ లోని అన్ని భాషా చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూకుడుగా వ్యవహరిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న స్నేహా ఇటు సోషల్ మీడియాలోనూ అందాల రచ్చ చేస్తోంది.
ఈ సందర్భంగా వరుస ఫొటోషూట్లు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను విందు చూస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. వయస్సు మీరినా స్నేహా మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. తాజాగా హోమ్లీ బ్యూటీ మరిన్ని ఫొటోలను పంచుకుంది.
స్నేహా పంచుకున్న లేటెస్ట్ ఫొటోల్లో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. గ్లామర్ షోకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. పద్దతిగానే కుర్రాళ్లను కవ్వించేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా చీరకట్టులో పరువాల ప్రదర్శన చేసింది.
అప్పటికే రూపసౌందర్యంలో దేవకన్యలా ఉండే స్నేహా.. తాజాగా లేత గులాబీ చీరలో మరింతగా మెరిసిపోతోంది. వెలిగిపోయే మోహంలో కాంతివంటి చిరునవ్వులకు యువత మంత్రముగ్ధులవుతున్నారు. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ విందు చేయడం మరింత ఆకర్షణీయంగా మారింది.
తెలుగులో బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించిన స్నేహా.. చివరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’లో వదినమ్మ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాగే టీవీ షోల్లోనూ మెరుస్తోంది. ప్రస్తుతం ‘డాన్స్ జోడీ డాన్స్ రీలోడెడ్’ షోకు జడ్జీగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.