పుష్ప జగదీష్ కేసుపై స్పందించిన శరణ్య.. అతడు ఎలాంటి వాడో తేల్చేసింది
నటి శరణ్య ప్రదీప్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటోంది. ఫిదా, భామ కలాపం లాంటి చిత్రాల్లో శరణ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.

నటి శరణ్య ప్రదీప్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటోంది. ఫిదా, భామ కలాపం లాంటి చిత్రాల్లో శరణ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక సుహాస్ అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ చిత్రంలో శరణ్య నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంలో సుహాస్ సోదరి పాత్రలో నటి శరణ్య ప్రదీప్ నటించారు.
అంబాజీ పేట.. చిత్రంలో కూడా శరణ్యకి నటనకు ప్రాధాన్యత ఉన్న పవర్ ఫుల్ రోల్ పడింది. తన నటనతో శరణ్య మెప్పించడం మాత్రమే కాదు.. ఒక సన్నివేశంలో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కీలక మైన సన్నివేశంలో శరణ్య న్యూడ్ గా నటించి షాక్ కి గురిచేసింది. తన భర్త ప్రోత్సాహంతోనే ఆ సన్నివేశంలో నటించగలిగాను అని శరణ్య పేర్కొంది.
ఈ చిత్రంలో పుష్ప ఫేమ్ జగదీశ్ కూడా కీలక పాత్రలో నటించాడు. జగదీశ్ శరణ్య ప్రియుడిగా నటించాడు. వీళ్లిద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో శరణ్య.. జగదీశ్ కేసుపై స్పందించింది. ఓ మహిళ ని ఆమె ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె ఆత్మహత్యకి కారణం అయ్యాడనే ఆరోపణలతో జగదీశ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం జగదీశ్ బెయిల్ పై విడుదలయ్యాడు. ఇంటర్వ్యూలో జగదీశ్ కేసు గురించి ప్రశ్నించగా శరణ్య ఆసక్తికర సమాధానం ఇచ్చింది. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన జగదీశ్ ఇలాంటి ఇబ్బందుల్లో చిక్కుకోవడం బాధాకరం.
అయితే మా సినిమా సెట్ లో మాత్రం జగదీశ్ మా అందరితో చాలా బాగా ఉండేవాడు. నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళని కూడా గౌరవంగా పలకరించేవారు. చాలా ఒదిగి ఉండే మనిషి. మాతో పాటు కలసి కిందే కూర్చుని భోజనం చేసేవాడు. నేను చూసినంతవరకు అతడి క్యారెక్టర్ లో ఎలాంటి తేడా లేదు.
కానీ అతడి కేసు విషయంలో ఏం జరిగిందో మనం చూడలేదు కాబట్టి దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అని శరణ్య పేర్కొంది. పుష్ప చిత్రంతో నిజంగానే జగదీశ్ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో ఇలా కేసులో చిక్కుకున్నాడు.