- Home
- Entertainment
- కుర్ర గుండెలు పేలిపోయేలా సదా ఫ్లైయింగ్ కిస్సెస్.. మత్తు చూపులు, టెంప్టింగ్ పోజులతో రచ్చ!
కుర్ర గుండెలు పేలిపోయేలా సదా ఫ్లైయింగ్ కిస్సెస్.. మత్తు చూపులు, టెంప్టింగ్ పోజులతో రచ్చ!
నటి సదా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ బ్యూటీ మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా పంచుకున్న గ్లామర్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

నటి సదా (Sada) పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చే పాట ‘రాను రాను అంటూనే చిన్నదో’. 2002లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘జయం’తో సదా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాతోనే వెండితెరపైనా అడుగు పెట్టింది.
నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు సౌత్ చిత్రాలతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హోమ్లీ బ్యూటీగా ఆడియెన్స్ లో ఫాలోయింగ్ పెంచుకుంది. ‘జయం’తో పాటు ‘అవునన్నా కాదన్నా’, ‘అపరిచితుడు’, ‘మోహిని’, ‘టక్కరి’, ‘మైత్రీ’ వంటి చిత్రాల్లో నటించింది.
మరోవైపు తమిళం, మలయాళం, కన్నడలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కొన్నాళ్లపాటు దక్షిణాదిలో తన సత్తా చాటింది. 2014 లో విడుదలైన తెలుగు చిత్రం ‘యమలీలా’లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఎలాంటి సినిమా చేలేదు. తమిళంలో చివరిగా ‘టార్చ్ లైట్’లో నటింది.
ఐదేండ్లుగా సదా ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదు. ఈ విషయం అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు. కానీ ఫ్యాన్స్ ను బుల్లితెర వేదికగా అలరిస్తూనే వచ్చింది. పాపులర్ డాన్స్ షో Dhee జూనియర్స్, జోడీ స్పెషల్ షోలకు జడ్జీగా వ్యవహరించి అభిమానులతో పాటు బుల్లితెర ప్రేక్షకులనూ అలరించింది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. ‘హాలో వరల్డ్’ వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో నెట్టింట గ్లామర్ విందు చేస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. తాజాగా సదా పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.
లేటెస్ట్ ఫొటోస్ లో సదా హాట్ లుక్ ను సొంతం చేసుకుంది. గ్రీన్ స్లీవ్ లెట్ టాప్ లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ మతిపోయే పోజులతో మైకం తెప్పిస్తోంది. అందామైన పెదాలతో గాల్లో ముద్దులు వదులుతూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. వయ్యారంగా పోజులిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగింది. దీంతో అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు.