అలాంటి ఫొటోలను చూస్తే బాధేస్తోంది.. ట్రోలర్స్ పై మండిపడ్డ నటి రితికా సింగ్!
తమిళ బ్యూటీ రితికా సింగ్ (Ritika Singh) ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయ్యారు. ఆమె నటించిన తాజా చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
మిక్డ్స్ మార్షల్ ఆర్టిస్ట్, తమిళ బ్యూటీ రితికా సింగ్ నటిగా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంటోంది. తెలుగులోనూ రెండు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది.
రితికా తన కేరీర్ ను తమిళ సినిమాలతోనే ప్రారంభించింది. మొన్నటి వరకూ అపడపా దడపా చిత్రాలతో నెట్టుకొచ్చిన ఈ భామ.. ప్రస్తుతం తమిళం, మలయాళంలో భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా తను నటించిన ‘ఇన్ కార్’ చిత్రం రిలీజ్ కు సిద్ధం అవుతోంది.
దర్శకుడు హర్ష వర్ధన్ తెరకెక్కించిన ‘ఇన్ కార్’ చిత్రంలో రితికా సింగ్ ప్రధాన పాత్ర పోషించింది. థ్రిల్లర్ సినిమా యాదార్థ సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా రితికా మాట్లాడుతూ.. ‘ఇన్ కార్’ చిత్ర విశేషాలను పంచుకుంది. అలాగే కొందరు ట్రోలర్స్, మీమర్స్ పైనా మండిపడింది. ప్రతి ఒక్కరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫొటోలను కొందరు ట్రోలర్స్ అసభ్యంగా ఎడిట్ చేస్తుండటం.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మీమ్స్ క్రియేట్ చేస్తుండటం బాధాకారంగా ఉంది.
నాకూ అలాంటివి ఎదురయ్యాయి. అలాంటి ఫొటోలు చూసినప్పుడు బాధాగా ఉంటుంది. క్రియేటర్స్ కాస్తా ఆలోచించాలి. మీకే కాదు మాకూ కూడా కుటుంబం ఉంటుంది. ఆ ఫొటోలను మా తల్లిదండ్రులు చూస్తే ఏమనుకుంటారనేది.. ఇప్పటికైనా ఆలోచించాలి. అమ్మాయిల పట్ల గౌరవంగా ఉండాలి. అమ్మాయిలూ సెల్ఫ్ డిఫెన్స్ కళలను నేర్చుకోవాలని’ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ గా మారింది.
గతంలో విక్టరీ వెంకటేష్ ‘గురు’చిత్రంలో రామేశ్వరి పాత్రలో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఆ తర్వాత ‘నీవెవ్వరో’ చిత్రంతోనూ అలరించింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తను నటించిన ‘ఇన్ కార్’ చిత్రం పాన్ ఇండియాన్ సినిమాగా విడుదల కాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో మార్చి 3న రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.