MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • రెండ్రోజుల్లో చనిపోయే పాప కోసం స్మశానానికి వెళ్లాం.. సభ్యులకు తన కన్నీటి గాధ చెప్పిన ప్రియ

రెండ్రోజుల్లో చనిపోయే పాప కోసం స్మశానానికి వెళ్లాం.. సభ్యులకు తన కన్నీటి గాధ చెప్పిన ప్రియ

బిగ్ బాస్ 5లో నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆర్జే కాజల్ గలగలా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది. నటి ప్రియతో.. అంట్లు తోమడం నావల్ల కాదు అని చెబుతుంది.

2 Min read
Author : pratap reddy
Published : Sep 08 2021, 11:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ 5లో నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆర్జే కాజల్ గలగలా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది. నటి ప్రియతో.. అంట్లు తోమడం నావల్ల కాదు అని చెబుతుంది. మనం ఇక్కడ ఉంటున్నప్పుడు ఒక్కోపని అలవాటు చేసుకోవాలి అని ప్రియా అంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక లహరి, హమీద మధ్య చిన్నపాటి వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. ఈ గొడవలో ఎమోషనల్ అయిన లహరి కంటతడి పెట్టుకుంది. తర్వాత హౌస్ లో కాస్త వినోదాత్మక సంఘటనలు జరుగుతాయి. సిరిని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ పిలుస్తారు. ఆమెకి బిగ్ బాస్ ప్రత్యేక పవర్స్ ఇస్తారు. దీని ప్రకారం ఇద్దరు సభ్యులని ఎంచుకోమని బిగ్ బాస్ సిరికి చెబుతారు. ఇద్దరిలో ఒకరు యజమాని, మరొకరు సర్వెంట్. యజమాని చెప్పినట్లు సర్వెంట్ నడుచుకోవాలి. దీని కోసం యజమానిగా షణ్ముఖ్ ని, సర్వెంట్ గా లోబోని సిరి ఎంచుకుంటుంది. 

36

షణ్ముఖ్ చెప్పినట్లు లోబో నడుచుకోవాలి. ఈ విషయాన్ని సిరి బయటకు వచ్చి వారిద్దరికీ చెబుతుంది. దీనితో షణ్ముఖ్ యజమానిగా మారి లోబోకి ఆర్డర్స్ వేస్తుంటాడు. హౌస్ లో ఉండే సభ్యులలాగా మిమిక్రి చేయమని షణ్ముఖ్ లోబోని ఆదేశిస్తాడు. లోబో అద్భుతంగా మిమిక్రి చేస్తాడు. ఆ తర్వాత లోబోని బాత్రూం వద్ద షణ్ముఖ్, రవి ఆడేసుకుంటారు. బట్టలు ఉతకమని, బకెట్ కడగమని చెబుతారు. రేయ్ రవి అంతకు అంత తీర్చుకుంటారా అంటూ లోబో రవికి సరదాగా వార్నింగ్ ఇస్తాడు. 

46

 ఇక హౌస్ లో ఓ ఎమోషనల్ సీన్.. ప్రియా తన పాప ఎలా మరణించిందో కొంతమంది సభ్యులకు కంటతడి పెట్టుకుంటూ వివరిస్తుంది. మాపాపకు క్యాన్సర్. చాలా క్యూట్ గా మాట్లాడేది. రెండ్రోజుల్లో చనిపోతుందని తెలుసు. పాప చనిపోయే రెండురోజుల ముందు స్మశానం మాట్లాడానికి వెళ్లాం. అది కోవిడ్ టైం.. అంత్యక్రియలు నిర్వహించడం చాలా కష్టం. అందుకే ముందుగా మాట్లాడడానికి వెళ్లాం. 

56

పాప బతికి ఉండగానే స్మశానానికి వెళ్లి.. తిరిగి వచ్చి చూస్తే పాప చిరునవ్వుతో కనిపించేది. ఆ క్షణంలో నాభాధ ఎలా ఉండేదంటే.. కడుపు లోపల నలిపేసినట్లు ఉండేది అంటూ ప్రియా కన్నీరు పెట్టుకుంది. ఇంటి సభ్యులు ఆమెని ఓదార్చారు. 

66

ఇక నేటి ఎపిసోడ్ చివర్లో నటి ఉమాదేవి రచ్చతో ముగుస్తుంది. ఆలు కర్రీ కోసం ఉమాదేవి.. ప్రియా, సరయు, అనీ మాస్టర్ లతో గొడవ పడుతుంది. అందరికి ఒకే కూర వండాలి. కొందరికి ఒక కూర.. ఇంకొందరికి మరో కూర ఏంటి అం ఉమా దేవి విరుచుకుపడుతుంది. అనీ మాస్టర్ మాత్రం ఏదైనా తప్పు జరిగిఉంటే క్షమించాలి అని కోరుతుంది. అలా నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. 
 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved