5 నిమిషాల సుఖం కోసం హీరోయిన్లని అలా.. కోట్లల్లో డబ్బు ఇచ్చేది అందుకే, కాస్టింగ్ కౌచ్ పై నటి ప్రగతి కామెంట్స్
చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉండేదే. కాస్టింగ్ కౌచ్ పేరుతో చిత్ర పరిశ్రమ మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదని ప్రగతి అన్నారు.
టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో సునామీగా మారిపోయారు. 90 వ దశకం నుంచి ఆమె నటిగా రాణిస్తున్నారు. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తల్లి, అత్త తరహా పాత్రలకు దర్శకులు ప్రగతినే సంప్రదిస్తున్నారు.
చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉండేదే. మీటూ ఉద్యమం మొదలైన తర్వాత నటీమణులు తమకి ఎదురైన వేధింపులని బయట పెట్టడం ప్రారంభించారు. కాస్టింగ్ కౌచ్ పేరుతో చిత్ర పరిశ్రమ మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదని ప్రగతి అన్నారు. కాస్టింగ్ కౌచ్ పై తన వెర్షన్ ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వినిపించారు.
సక్సెస్ సాధించి ఓ స్థాయికి ఎదిగిన హీరోయిన్లని ఎవరినైనా అడగండి.. కాస్టింగ్ కౌచ్ అనుభవం తమకి లేదనే చెబుతారు. ఇండస్ట్రీలో చిన్న చిన్న సంఘటనలు జరిగినా.. విజయం సాధించిన హీరోయిన్లు వాటిని పట్టించుకోరు. కానీ కాస్టింగ్ కౌచ్ కంప్లైంట్స్ ఎక్కువగా సక్సెస్ సాధించలేకపోయిన హీరోయిన్ల నుంచే వస్తుంటాయి. కాస్టింగ్ కౌచ్ సంఘటనలు కొన్ని జరిగి ఉండొచ్చు. కొట్టి పారేయలేం. కానీ వాళ్ళని సంప్రదించిన దర్శకులు, నిర్మాతలు అంత గొప్ప వారు కాదేమో. అలాంటి వాళ్ళు ప్రతి రంగంలో ఉంటారు.
ఒక అమ్మాయి కోసం సినిమా తీయరు. హీరోయిన్లపై కోట్లల్లో డబ్బు ఇన్వెస్ట్ చేసేది, వాళ్ళకి పారితోషికం ఇచ్చేది 5 నిమిషాల సుఖం కోసం కాదు. పలానా అమ్మాయి అందుకు ఒప్పుకుంటే ఛాన్స్ ఇస్తా అంటే కుదరదు. ఆ అమ్మాయికి ఆ పాత్ర సూట్ అయితేనే ఎంపిక చేస్తారు. ఎందుకంటే సినిమా రిజల్ట్ హీరోయిన్ పై ఆధారపడి ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ హీరోయిన్ల కెరీర్ ని ప్రభావితం చేస్తుంది అంటే తాను నమ్మను అని ప్రగతి అన్నారు. ప్రతిభ, పొటెన్షియల్ ఉంటే సంవత్సరం లేటు అయినా మంచి ఆఫర్స్ వస్తాయి.
ప్రతిభ లేకుండా కాస్టింగ్ కౌచ్ ని కారణంగా చెప్పే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు అని ప్రగతి అన్నారు. ఒక చిత్రంలో ఆ పాత్రకి ఏ అమ్మాయి బావుంటుందో దర్శక నిర్మాతలు వారినే తీసుకుంటారు. నేను ఇన్నేళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఉంటున్నాను. నాకు ఎలాంటి నెగిటివిటి కనిపించలేదు. కానీ ఒకటి రెండు చిత్రాలు చేసి వెళ్లిపోయిన వారు సినిమా ఇండస్ట్రీ అంతా ఇంతే అన్నట్లుగా మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళని సినిమా గురించి ఏం తెలుసు అని అనిపిస్తుంది.
నాకు ఇండస్ట్రీలో ఎప్పుడూ అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. కానీ ఎవరైనా ఎవరైనా పరోక్షంగా అలా మాట్లాడితే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసి మరో మూవీలో ఛాన్స్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగని నేను ఇండస్ట్రీని ఎప్పుడూ తప్పు బట్టలేదు. ఒక అమ్మాయి అందంగా ఉంటే అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఆమె నుంచి ఏదైనా ఆశించే వారు ఉంటారు.
ఈ ఒక్క పాయింట్ పట్టుకుని చిత్ర పరిశ్రమలో జరుగుతున్న వందల కోట్ల బిజినెస్ అంత దానికోసమే అన్నట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సినిమా వేల మందికి జీవనాధారం. అలాంటి సినిమాని పట్టుకుని ఆ ఒక్క అంశమే ఇండస్ట్రీ అంటూ మాట్లాడడం కుసంస్కారం అని ప్రగతి అన్నారు.
ఇక నెపోటిజం గురించి మాట్లాడుతూ..పోలీస్ కొడుకు పోలీస్ కావాలనుకోవడం, డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనుకోవడం తప్పులేదు. అలాగే నటుడి కొడుకు కూడా నటుడు కావాలనుకుంటారు. కానీ వాళ్ళకి పొటెన్షియల్ ఉంటేనే క్లిక్ అవుతారు. వాళ్ళ తండ్రి వల్ల ఇంట్రడక్షన్ సులభం అవుతుంది అంతే. ఎంట్రీ ఇచ్చాక వాళ్ళ కష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ఎవరి నటనని వాళ్లే నటించాలి అని ప్రగతి అన్నారు.