- Home
- Entertainment
- శరత్ బాబుతో బిడ్డని కనాలని ప్లాన్ చేశా, కానీ..చాలా మంది నా దగ్గర ఆ అవసరం తీర్చుకున్నారు
శరత్ బాబుతో బిడ్డని కనాలని ప్లాన్ చేశా, కానీ..చాలా మంది నా దగ్గర ఆ అవసరం తీర్చుకున్నారు
తెలుగు సీనియర్ నటి జయలలిత దశాబ్దాల కాలంగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. గుర్తుంచుకోదగ్గ నటిగా పలు చిత్రాల్లో నటించారు. ఆమె ఎక్కువగా వ్యాంప్ పాత్రలు చేసినప్పటికీ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.

తెలుగు సీనియర్ నటి జయలలిత దశాబ్దాల కాలంగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. గుర్తుంచుకోదగ్గ నటిగా పలు చిత్రాల్లో నటించారు. ఆమె ఎక్కువగా వ్యాంప్ పాత్రలు చేసినప్పటికీ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. భరత్ అనే నేను చిత్రంలో అసెంబ్లీ స్పీకర్ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
అందరిలాగే తనకి కూడా తెరవెనుక కన్నీటి కష్టాలు ఉన్నట్లు జయలలిత తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. జయలలిత ఒక డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని మూడు నెలలకే విడిపోయిందట. అతడి టార్చర్ భరించలేక విడిపోయింది. అప్పటి నుంచి జయలలిత సింగిల్ గానే ఉండిపోయింది.
తన కెరీర్ లో కష్టాల గురించి చెప్పే క్రమంలో జయలలిత సంచలన విషయాన్ని బయట పెట్టింది. దివంగత నటుడు శరత్ బాబుని తానూ ఎంతగానో ప్రేమించానని తెలిపింది. ఆయనతో కలసి కొన్నేళ్లు ట్రావెల్ చేశా. ఇద్దరం అనేక యాత్రలకి కూడా వెళ్లాం. ఆయనతో జీవితాంతం లైఫ్ ని షేర్ చేసుకోవాలనుకున్నా. కానీ ఆయన ఎక్కువ ఆసక్తి చూపలేదు. ఏ విషయం గురించి అయినా ఆయన ఎక్కువ ఆలోచిస్తారు.
మా పెళ్లి జరగకుండా ఇండస్ట్రీలోనే కొందరు అడ్డుకున్నారు. ఆయనతో బిడ్డని కనాలని కూడా ప్లాన్ చేశా. ఆయనకి కూడా నాతో బిడ్డని కనాలని ఆసక్తి ఉండేది. కానీ ఒక వేళ మనిద్దరం బిడ్డని కని చనిపోతే బయట వాళ్ళు ఆస్తి కోసం ఆ బిడ్డని వేధిస్తారేమో అని భయపడ్డారు. ఆయనతో గడిపితే సమయం కూడా తెలిసేది కాదు. ఆయన ఎక్కువగా యాత్రలకి వెళ్ళేవాళ్ళు. నేను ఆడదాన్ని అనే అభ్యంతరం మీకు లేకుంటే నన్ను కూడా మీతో తీసుకెళ్లండి అని అడిగాను . ఆ విధంగా ఆయనతో నా జర్నీ ప్రారంభం అయింది అని జయలలిత పేర్కొంది.
కనీసం ఆయనకి జీవితాంతం సేవ చేసుకుంటూ గడపాలనుకున్నా. కానీ దేవుడు ఆయన్ని తీసుకెళ్లిపోయారు. నేను ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలు వేయడం నాకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చాలా ఏమండీ సీనియర్ నటీమణులు అక్క, వదిన, తల్లి పాత్రల్లో నటిస్తూ గుర్తింపు పొందుతున్నారు. కానీ నాకు మాత్రం ఆ ముద్ర పడిపోవడం వల్ల సరైన పాత్రలు రావడం లేదు.
గ్లామర్ పాత్రలు చేయడం వల్ల నన్ను చాలా మంది అనుభవించాలని ప్రయత్నించేవారు. కొన్నిసార్లు పారిపోయేదాన్ని. కానీ కొన్నిసార్లు లొంగిపోక తప్పలేదు. నా ఫ్యామిలీ అయినా బావుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి ఆ సుఖం అందించాను. నేను చెడిపోయినా పర్వాలేదు.. నా ఫ్యామిలీ బావుండాలని కోరుకున్నా అంటూ జయలలిత ఎమోషనల్ అయింది.
ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తనకు రేప్ సీన్ వివరిస్తానని గదిలోకి తీసుకెళ్లి నిజంగానే రేప్ చేసిన సంఘటనని కూడా తాను ఎదుర్కొన్నట్లు జయలలిత తెలిపింది. వాడి పాపానికి అతడు ఆరు నెలలకే చనిపోయాడని జయలలిత పేర్కొంది.