Actress: చేసింది ఒకే ఒక్క సినిమా.. రూ. 43,000 కోట్లకు మహారాణి.. ఈ చిన్నది ఎవరంటే.?
Actress: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆస్తులు గురించి మీరు వినే ఉంటారు. తాజాగా అతడు బిలినీయర్ల లిస్టులోకి కూడా చేరారు. అయితే షారుఖ్‌కు కంటే అతడి హీరోయిన్ ఆస్తి మూడున్నర రెట్లు ఎక్కువ.. మరి ఆ హీరోయిన్ ఎవరో.? ఏ సినిమా చేసిందో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇండస్ట్రీలో కొత్త అందాలకు కొదవలేదు..
సినిమా ఇండస్ట్రీలో కొత్త అందాలకు కొదవ లేదు. ప్రతీ సినిమాకు కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటుంది. మీరు ఈ మధ్య చూసే ఉంటారు. మన టాలీవుడ్‌లోనే ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చిన నటీమణులు ఎందరో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం.. ఆమె చేసింది ఒక్క సినిమానే కానీ కోట్లకు యువరాణి. ఎంతలా అంటే.? బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఆస్తికి మూడింతలు.. మరి ఆమె ఎవరంటే.?
ఒకే ఒక్క సినిమా చేసిన నటి..
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ గాయత్రి జోషి. ఈ పేరు టాలీవుడ్‌కు పెద్దగా పరిచయం లేదు. అలా అని బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు కూడా గుర్తులేని వ్యక్తే. ఎందుకంటే ఈమె బీ-టౌన్‌లో చేసింది ఒకే ఒక్క సినిమా. ఇక ఈమె భర్త గురించి చెప్పాలంటే.. పేరు వికాస్ ఒబెరాయ్.. బిజినెస్ ప్రపంచంలో టైకూన్ అని చెప్పొచ్చు. 2005లో వికాస్ ఒబెరాయ్‌ను గాయత్రి జోషి వివాహం చేసుకుంది.
గాయత్రి జోషి వ్యక్తిగత విశేషాలు..
1977, మార్చి 20న ముంబైలో జన్మించింది గాయత్రి జోషి. 48 ఏళ్ల ఆమె 2004లో 'స్వదేస్' అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీకి హీరో షారుఖ్ ఖాన్ కాగా.. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించారు. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఆడకపోగా.. మ్యూజిక్ పరంగా హిట్ సాధించింది. ఇక 'స్వదేస్' సినిమా తర్వాత గాయత్రి జోషి.. ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ఆ వెంటనే వికాష్ ఒబెరాయ్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కాగా.. ప్రస్తుతం గాయత్రి తన కుటుంబాన్ని, భర్త వ్యాపారాలను చూసుకుంటోంది.
వికాస్ ఒబెరాయ్ ఫ్యామిలీ బిజినెస్
ఇక వికాస్ ఒబెరాయ్ ఫ్యామిలీ బిజినెస్ విషయానికొస్తే.. ఇటీవల విడుదల చేసిన హురున్ రిచ్ లిస్టు 2025 ప్రకారం.. గాయత్రి జోషి భర్త వికాస్ ఒబెరాయ్ నికర ఆస్తుల విలువ రూ. 42,960 కోట్లు (అంటే 4.2 బిలియన్ డాలర్లు)గా ఉంది. ఈ లిస్టులో షారుఖ్ ఖాన్ కూడా ఉండగా.. అతడి నికర ఆస్తుల విలువ రూ. 12,490 కోట్లు(అంటే 1.2 బిలియన్ డాలర్లు)గా ఉంది. దీని బట్టి చూస్తే.. షారుఖ్ కంటే.. అతడితో నటించి హీరోయిన్ భర్త ఆస్తుల వులువ మూడున్నర రెట్లు ఎక్కువ. ఈ లిస్టులో వికాస్ ఒబెరాయ్ 58వ స్థానంలో ఉన్నాడు.
ఒబెరాయ్ రియాల్టీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
ఒబెరాయ్ రియాల్టీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు వికాస్ ఒబెరాయ్. 2005లో ఇదే కంపెనీకి ప్రమోటర్‌గా ఉన్న ఆయన.. ఇప్పుడు చైర్మన్‌గా ఎదిగారు. ముంబైలోని పలు ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపట్టింది. ఈ కంపెనీ వర్లి ఏరియాలో కట్టిన 360 వెస్ట్ అపార్ట్ మెంట్స్ ప్రాజెక్ట్ ఇప్పటికీ దేశంలో ఓ హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎంతోమంది బాలీవుడ్ నటులు అక్కడ నివాసముంటున్నారు. అక్కడ ఒక్కో ఫ్లాట్ సుమారు రూ. 45 కోట్లు పలుకుతుంది. లగ్జరీయస్ వెస్టిన్ హోటల్ కూడా వికాస్ ఒబెరాయ్ పేరు మీదే ఉండటం గమనార్హం.