యాక్టర్స్ దెబ్బ.. డైరెక్టర్స్ 'అబ్బా'!

First Published 28, Feb 2019, 11:53 AM

యాక్టర్ల దెబ్బకి దర్శకుల దిమ్మ తిరిగిపోతోంది

డైరెక్టర్ ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు.. కానీ కొందరు స్టార్లు మాత్రం వాళ్లను అవమానిస్తూ క్రెడిబిలిటీని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి హీరోలు చాలా మంది దర్శకుల ఒపినీయన్ కి విలువ ఇవ్వడం లేదు.. అలాంటి నటీనటులు చాలా మంది ఉన్నారు.

పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ముందుగా సంపత్ నందితో మొదలుపెట్టారు. కానీ ఆ తరువాత బాబీకి అప్పగించారు.

కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక' క్రిష్ ని వివాదంలోకి లాగింది. అతడికి దక్కాల్సిన క్రెడిట్ లాక్కుందని విమర్శల పాలైంది.

హ్రితిక్ రోషన్ 'సూపర్ 30' చిత్ర దర్శకుడు వికాస్ బాల్ ని దోషిగా నిలబెట్టాడు.. కంగనా 'క్వీన్' సినిమా సమయంలో వికాస్ తనతో తప్పుగా ప్రవర్తించారని చెప్పగానే సినిమా నుండి తొలగించాడు.

దర్శకుడు బాలకి సౌత్ లో సెపరేట్ ఇమేజ్ ఉంది. సిల్వర్ స్క్రీన్ కి కొత్తదనం తీసుకొచ్చే ఈ దర్శకుడిని మంచి అవుట్ పుట్ ఇవ్వలేదని అర్జున్ రెడ్డి రీమేక్ 'వర్మ' నుండి తప్పించారు.

మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అమోల్ గుప్తా విషయంలో క్రెడిట్ తీసుకున్నాడని అంటారు. 'తారే జమీన్ పర్' రైటర్ కం డైరెక్టర్ గా అమోల్ గుప్తా రాసుకున్న కథకు అమీర్ క్రెడిట్ తీసుకున్నాడని గతంలో అమోల్ ఆరోపణలు చేశాడు.

బాలకృష్ణ దర్శకనిర్మాతల హీరో అని చెబుతారు. కానీ నిర్మాతగా మారాక మాత్రం దర్శకుడి కమాండ్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. తండ్రి బయోపిక్ నుండి తేజని అర్ధాంతరంగా తప్పించారు.

క్వీన్ రీమేక్ గా తెరకెక్కుతోన్న 'మహాలక్ష్మీ' సినిమాకి దర్శకుడిగా మొదట నీలకంఠని తీసుకున్నారు. కానీ మధ్యలోనే అతడిని తీసేశారు. దర్శకుడు బయటకి వెళ్లిపోవడంలో తమన్నా హ్యాండ్ ఉన్నట్లు టాక్.