- Home
- Entertainment
- చిరంజీవి డ్యాన్స్ చూడరా అని డైరెక్టర్ నాతో అన్నారు.. మెగాస్టార్ తో పోటీపై సుమన్ ఓపెన్ కామెంట్స్ వైరల్
చిరంజీవి డ్యాన్స్ చూడరా అని డైరెక్టర్ నాతో అన్నారు.. మెగాస్టార్ తో పోటీపై సుమన్ ఓపెన్ కామెంట్స్ వైరల్
చిరంజీవి డ్యాన్స్ చూసి నేర్చుకోమని ఓ డైరెక్టర్ తనకి చెప్పినట్లు సుమన్ పేర్కొన్నారు. చిరంజీవితో అప్పట్లో తన పోటీ ఎలా ఉండేదో వివరించారు.

సుమన్ కెరీర్ లో వివాదం
సీనియర్ హీరో సుమన్ ప్రస్తావన రాగానే వెంటనే చిరంజీవి గురించి కూడా అంతా మాట్లాడుతుంటారు. సుమన్ తన కెరీర్ లో ఎదుర్కొన్న వివాదానికి కారణం చిరంజీవి అంటూ చాలా ఏళ్లపాటు ఫేక్ ప్రచారం ఒకటి నడిచింది. స్వయంగా సుమన్ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్ కి చెక్ పడినట్లు అయింది. తాను జైలు పాలు కావడానికి తమిళనాడులో కొంత మంది కారణం అని సుమన్ తెలిపారు. ఆ టైంలో చిరంజీవి, నేను పోటా పోటీగా సినిమాలు చేస్తుండడం వల్ల ఆయన పేరుని అనవసరంగా ఈ వివాదంలోకి లాగారు అని సుమన్ క్లారిటీ ఇచ్చారు.
KNOW
నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు అన్నారు
సుమన్ జైలు పాలు కాకుంటే చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చేవారని అప్పట్లో ఇండస్ట్రీలో చాలా మంది భావించారు. సుమన్ కి కూడా ఈ విషయాన్ని చాలా మంది చెప్పారట. నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు, ఎక్కడో ఉండాల్సినోడివి అని అంటుంటారు. వారి మాటలతో నేను ఏకీభవించను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చాను. కాబట్టి నేను ఇన్నేళ్ళపాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమే గొప్ప విషయం.
మా ఇద్దరి మధ్య కాంపిటీషన్
నేను, చిరంజీవి దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి రావడం వల్ల మా మధ్య కాంపిటీషన్ సృష్టించారు. కానీ నేను ఎప్పుడు కూడా చిరంజీవికి పోటీ అని ఫీల్ అవ్వలేదు. డ్యాన్సులు, ఫైట్స్ చిరంజీవిగారు అద్భుతంగా చేస్తారు. అందులో అనుమానం లేదు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో జరిగిన ఇంటర్వ్యూలో సుమన్ ఈ విషయాలు వివరించారు.
చిరంజీవి డ్యాన్స్ చూడరా అని సుమన్ కి చెప్పిన డైరెక్టర్
తమ్మారెడ్డి, సుమన్ కాంబినేషన్ లో కొన్ని చిత్రాలు వచ్చాయి. ఆ టైంలో తమ్మారెడ్డి గారే తనతో.. చిరంజీవి డ్యాన్స్ చూడరా, ఆ ఫుట్ మూమెంట్ గమనించు అని చెప్పేవారని సుమన్ గుర్తు చేసుకున్నారు. చిరంజీవిని మించిపోవాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. కనీసం ఆయన లెవల్ కి మ్యాచ్ అయ్యేలా ఉండాలని ట్రై చేసినట్లు సుమన్ తెలిపారు. ఇప్పటికి కూడా డ్యాన్స్ లో చిరంజీవి ఫుట్ వర్క్ , గ్రేస్ ఉన్నట్లు ఇంకెవరికీ ఉండదు అని సుమన్ ప్రశంసించారు.
అది నా అదృష్టం
నాకు మొదట్లో తెలుగు భాష రాదు. కానీ కష్టపడి నేర్చుకున్నా. తెలుగులోనే 100 సినిమాల్లో హీరోగా నటించానంటే మామూలు విషయం కాదని సుమన్ అన్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నప్పుడు అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర,శ్రీరామదాసులో రాముడి పాత్ర చేయడం తన అదృష్టం అని సుమన్ అన్నారు.