కోట్లలో నష్టపోయా.. ఆమె వల్లే బ్రతికున్నా.. శివబాలాజీ ఎమోషనల్ కామెంట్స్
తను ప్రస్తుతం ఇలా ఉండటానికి కారణం తన భార్యే అంటున్నాడు హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివబాలాజి. కోట్లలో నష్టపోయిన తాను కోలుకోడానికి కారణం తానే అంటున్నాడు.

హీరోగా ఎంటర్ అయ్యి..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి.. తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు శివబాలాజీ. వ్యాపార కుంటుంబం నుంచి వచ్చినా.. నటనమీద ఇంట్రెస్ట్ తో.. ఇండస్ట్రీలోకి కష్టపడి వచ్చాడు. చెల్లెలు పాత్రలకు బ్రాండ్ గా ఉన్న మధుమితను ప్రేమించి పెళ్ళాడాడు శివబాలాజీ. తన భార్య గురించి చెపుతూ ఓ సందర్భంలో ఎమోషనల్ అయ్యాడు.
ఇండస్ట్రీకి రాకముందు తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకునేవాడు శివ బాలాజీ. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీపై ప్రేమతో ఎంట్రీ ఇచ్చాడు. కాని ఇక్కడ స్టార్ డమ్ మాత్రం సాధించలేకపోయాడు. దీని తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. తానేంటో అందరికి తెలిసేలా చేశాడు. అంతే కాదు తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ గా నిలిచాడు శివబాలాజీ.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు శివబాలాజీ తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాల గురించి ఈ సందర్భంగా పంచుకన్నాడు. ఆయన మాట్లాడుతూ.. నేను నా జీవితంలో కోట్ల ఆస్తులు నష్టపోయాను. కానీ ఇప్పుడు ఇలా బ్రతికి ఉన్నాను అంటే అది నా భార్య సహకారం వల్లే అన్నారు శివ. ముఖ్యంగా తను తను చేసిన వ్యాపారాలు.. వాటి నష్టాల గురించి వివరించాడు శివబాలాజీ.
మొదట ఈము పక్షుల పెంపకం, ఆతరువాత ఆయిల్ వ్యాపారం.. తరువాత నిర్మాతగా సినిమా.. ఇవన్నీ నష్టాలే తెచ్చాయి శివబాలాజీకి వాటి గురించి చెపుతూ ఆయన ఇలా అన్నారు. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఈము పక్షుల పెంపకాన్ని మొదలుపెట్టాం.మొదటగా 500 పక్షులతో యూనిట్ స్టార్ట్ చేశాం.వాటికోసం నెలకు 5 లక్షలకు పైగా ఖర్చ పెట్టామన్నారు.
అంతా కష్టపడితే.. ఈ పక్షులు మార్కెట్ చేయడానికి అవకాశం లేదని తెలిసింది. దాంతో అందులో పెట్టిన డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.. దాంతో ఇందులో తీవ్రంగా నష్టపోయాం అన్నారు శివబాలాజీ. అంతే కాదు ఇది నష్టపోయినా.. భయపడకుండా.. దీని తర్వాత మరో వ్యాపారం స్టార్ట్ చేశాను అన్నారు శివ.
ఈసారి పెయిన్ రిలీఫ్ ఆయిల్, సోప్స్ బిజినెస్ లోకి దిగాను కాని ఇందులో కూడా ఏమాత్రం లాభం రాలేదు. పైగా పెట్టుబడి కూడా రాకుండా.. విపరీతమైన నష్టం వాటిల్లింది. దీని తర్వాత వెంటనేస్నేహమేరా జీవితం అనే సినిమాను చేశాను. దీనికి నిర్మాతగా రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టాను కాని ఈ మూవీ ఆడలేదు ఇలా వరుసగా ఒకదాని వెంట మరొకటి నష్టపోతూ వచ్చాను అన్నారు శివబాలాజీ
వెంటనే మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను... ఈ టైమ్ లో నా భార్య నా వెంటే ఉండి.. నాకు ధైర్యం చెప్పింది. నన్ను మామూలు మనిషిని చేసింది. ఆమె ఉండబట్టి ఇలా ఉన్నాను లేకుంటే డిఫ్రెషన్ లో ఏమైపనోయోవాడినో అంటూ చెప్పుకొచ్చారు శివబాలాజీ.
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. మంచి పేరు తెచ్చుకున్నాడు శివ బాలాజీ. ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ అనే చిత్రంతో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.చందమామ సినిమాతో శివబాలాజీ పేరు మారుమోగింది. ఈ ఒక్క సినిమానే కాకుండా ఆయన చాలా సినిమాల్లో హీరోగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.