- Home
- Entertainment
- లేట్ వయసులో ఓ ఇంటివాడైన రణ్‌దీప్ హుడా.. గ్రాండ్‌గా ట్రెడిషనల్ వెడ్డింగ్.. అమ్మాయి ఎవరంటే?
లేట్ వయసులో ఓ ఇంటివాడైన రణ్‌దీప్ హుడా.. గ్రాండ్‌గా ట్రెడిషనల్ వెడ్డింగ్.. అమ్మాయి ఎవరంటే?
బాలీవుడ్ విలన్ రణ్‌దీప్ హుడా పెళ్లి చేసుకున్నారు. మణిపురికి చెందిన నటి లిన లైష్రామ్‌తో రాత్రి ఆయన వివాహం చాలా గ్రాండ్‌గా జరిగింది. ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ విలక్షణ నటుడు రణ్‌దీప్ హుడా ఓ ఇంటివాడయ్యాడు. లేట్ వయసులో ఆయన వివాహం చేసుకున్నారు. మణిపూర్ కి చెందిన నటి, మోడల్ లిన్ లైష్రామ్ తో రణ్‌దీప్ మ్యారేజ్ జరిగింది. బుధవారం రాత్రి చాలా గ్రాండ్‌గా వీరి వివాహం జరగడం విశేషం. మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో వారి సాంప్రదాయ పద్ధతిలో చాలా లావిష్‌గా స్కేల్‌లో మ్యారేజ్ చేసుకోవడం విశేషం.
ఈ సందర్భంగా రణ్‌దీప్ హుడా తన పెళ్లి విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా ఆయన ఫోటోలను పంచుకున్నారు. ఇందులో వైట్ డ్రెస్‌ల కనిపించారు రణ్‌దీప్. వైట్ కుర్తా, దోతిలో ఆయన రాయల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయనే కాదు, వారి బంధువులు సైతం వైట్ డ్రెస్‌లో మెరిశారు.
ఇక లిన్ లుక్ స్పెషల్ ఎట్రాక్ష్‌గా ఉంది. ఆమె మణిపర్ సాంప్రదాయాన్ని తలపించేలా పెళ్లి దుస్తులు ధరించడం విశేషం. వైట్ అండ్ పింక్ శారీ బ్లాక్ బ్లౌజ్ ధరించింది. గోల్డ్ జ్యూవెల్లరి ధరించి గార్జియస్‌గా ఉంది. ఆమె అందరిని ఆకర్షిస్తుంది.
ఈ సందర్భంగా తమ పెళ్లి ఫోటోలను పంచుకుంటూ రణ్ దీప్ హుదా పోస్ట్ పెట్టారు. తాము ఒక్కటయ్యామని, జస్ట్ ఇప్పుడే పెళ్లి అయ్యిందని చెబుతూ, లవ్ హార్ట్ ఎమోజీని పంచుకున్నారు. అంతకు ముందు ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన మణిపూర్ కల్చర్‌ని ప్రతిబింబించేలా మ్యారేజ్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
`వధువు సాంప్రదాయంలో వచ్చ పెళ్లి చేసుకోవడం చాలా గౌరవప్రదమైనదిగా భావిస్తున్నా. ఈ పెళ్లి వేడుక కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. నా భాగస్వామి కల్చర్‌ని అనుభవిస్తున్నాను. ఎలాంటి తప్పులు చేయనని ఆశిస్తున్నా` అని చెప్పారు.
`మేం మణిపురి సంస్కృతి గురించి మాట్లాడుఉతున్నాం. చాలా కాలంగా. నేను చాలా మంది పిల్లలు, సమృద్ధితో నిండిన సంతోషకరమైన భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నా. మా స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడం, ఒక ఫ్యామిలీగా మారడం చాలా ఇష్టం` అని చెప్పారు రణ్‌దీప్ హుడా.
రణ్‌దీప్ హుడా.. బాలీవుడ్‌లో నటుడిగా రాణిస్తున్నారు. ఆయన ఎక్కువగా విలన్ పాత్రలతో మెప్పిస్తున్నారు. ఇక లిన్ లైష్రామ్.. మణిపురి నటిగా రాణిస్తుంది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తుంది. హిందీలో ఆమె `ఓం శాంతి ఓం`, `మేరీ కోమ్`, `రంగూన్`, `జానే జాన్` వంటి సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం రణ్‌దీప్ హుడా ఏజ్ 47, లిన్ ఏజ్ 37. ఓ రకంగా ఇది లేట్ వయసనే చెప్పాలి. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు.