పవన్ ఊసరవెల్లి, నమ్మడానికి వీల్లేదు...ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
First Published Nov 27, 2020, 1:59 PM IST
తెలంగాణా రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం, వాడివేడిగా సాగుతుండగా నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఒక ఊసరవెల్లిగా వర్ణించారు.

ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన బాణీ వినిపించారు. బీజేపీ పార్టీ మరియు నాయకులపై ఆయన నిప్పులు చెరిగారు.
(photo courtesy:tv9)

బీజేపీ పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు పలకడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పవన్ తనను పూర్తిగా నిరాశపరిచాడు అన్నాడు. అతను ఒక నాయకుడు, అతనికి జనసేన అనే రాజకీయ పార్టీ ఉంది. అలాంటి పవన్ బీజేపీ పంచన చేరడం ఏమిటని ప్రశ్నించారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?