- Home
- Entertainment
- Acharya Review: ఆచార్య ప్రీమియర్ షో టాక్... ఫ్యాన్స్ కి పూనకాలు మరి సాధారణ ప్రేక్షకులు?
Acharya Review: ఆచార్య ప్రీమియర్ షో టాక్... ఫ్యాన్స్ కి పూనకాలు మరి సాధారణ ప్రేక్షకులు?
చిరంజీవి- రామ్ చరణ్ ల మల్టీస్టారర్ గా సహజంగానే ఆచార్య చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తెరకెక్కించిన ఆచార్య ఆ అంచనాలు అందుకుందా లేదా అనేది చూద్దాం..

చిరంజీవి (Chiranjeevi) తన సొంత బ్యానర్ లో ఆచార్య తెరకెక్కించారు. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి తెరకెక్కించడంలో దర్శకుడు కొరటాల మంచి దిట్ట. దర్శకుడిగా ఆయన గత నాలుగు చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇక చిరంజీవి-చరణ్ లాంటి స్టార్స్ తో చేస్తున్న ఈ మూవీ ఎలా తీర్చిదిద్దనున్నాడనే ఆత్రుత ప్రేక్షకుల్లో నెలకొంది.
కాగా ఆచార్య (Acharya)కథ విషయానికి వస్తే.. పచ్చని, ప్రశాంతమైన అడవిలో ఉన్న పుణ్యక్షేత్రం ధర్మస్థలి. ఆ ఆలయాన్ని, అమ్మవారిని నమ్ముకొని పాద ఘట్టం ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు. వారి ప్రశాంతమైన జీవితాలను స్వార్థపరుల వ్యాపార దాహం ఛిన్నాభిన్నం చేస్తుంది. అయితే వాళ్ళ ఆగడాలను ఆచార్య(చిరంజీవి) అడ్డుకుంటాడు. మరి ఆచార్యకు ధర్మస్థలికి ఉన్న సంబంధం ఏమిటీ? ధర్మస్థలికి చెందిన సిద్ధ(రామ్ చరణ్) నక్సల్ గా ఎందుకు చేరాడు? అసలు సిద్ధ, ఆచార్య నేపధ్యాలు ఏమిటీ? వారు ధర్మస్థలిని దుర్మార్గుల బారి నుండి ఎలా కాపాడారు? అనేది మిగతా కథ
ఆచార్య (Acharya Review)మెగా ఫ్యాన్స్ ని కొంత మేరకు అలరించే చిత్రంగా చెప్పుకోవచ్చు. యాక్షన్ సన్నివేశాలతో పాటు సాంగ్స్ లో తండ్రీ కొడుకులు పోటీపడి నటించడం బాగుంది. చిరంజీవి, చరణ్ ల స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు కొరటాల ఇద్దరి పాత్రలను కథలో మిళితం చేసి నడిపిన తీరు బాగుంది.
ఇక సినిమాలో చరణ్ (Ram charan)ఎంట్రీ ఎప్పుడు? ఆయన పాత్ర ఏమిటీ? అనే ఉత్కంఠ ఫస్ట్ హాఫ్ లో కొనసాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగానే కుదిరింది. రామ్ చరణ్ ఎంట్రీ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది. ఇక పూజా హెగ్డే తో చరణ్ కెమిస్ట్రీ, రొమాన్స్ పర్వాలేదు. చరణ్ ది గెస్ట్ రోల్ కాబట్టి మరీ ఎక్కువగా ఆశించడం తప్పే.
కాగా సహజంగా కొరటాల శివ (Koratala Siva)కథలు బలంగా ఉంటాయి. ట్విస్ట్స్, టర్న్స్ కి ఆయన అంతగా ప్రాధాన్యత ఇవ్వకున్నా ప్రేక్షకుడిని తన కథనంలో ఇన్వాల్వ్ చేస్తారు. ఆచార్య చిత్రానికి అది మిస్ అయ్యింది. బలహీనమైన కథనం ప్రేక్షకుడిని పూర్తి స్థాయిలో థ్రిల్ చేయలేకపోయింది. ఇద్దరు స్టార్ హీరోలలో ఒక్కరికి కూడా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించే సన్నివేశాలు లేవు. ఎలివేషన్స్ విషయంలో కొరటాల న్యాయం చేయలేకపోయారన్న మాట వినిపిస్తుంది.
ఫ్లాట్ నేరేషన్ కారణంగా కథ, కథనాలు ప్రేక్షకులు అంచనా వేసేలా ఉన్నాయి. రెండు సాంగ్స్, ఒకటి రెండు యాక్షన్ సన్నివేశాలు మాత్రం అలరిస్తాయి. మొత్తంగా సగటు ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా ఆచార్య లేదనేది కొందరి అభిప్రాయం. ఇక ఈ మూవీ అసలు ఫలితం తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.