ఇంట్లో పెత్తనమంతా ఐశ్వర్యరాయ్ దే.. అసలు సీక్రేట్ వెల్లడించిన అభిషేక్ బచ్చన్.
బాలీవుడ్ సీనియర్ బ్యూటీ.. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.. ఆమె భర్త.. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. ఇంట్లో హోమ్ మినిస్టర్ తానే అంటున్న అభిషేక్ ఇంకేం విషయాలు పంచుకున్నారంటే..?
విశ్వసుందరిగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి.. ఆతరువాత బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అబితాబ్ తనయుడు... హీరో అభిషేక్ బచ్చన్ ను పెళ్ళాడింది ఐశ్వర్య రాయ్. వీరి పెళ్ళి జరిగి దాదాపు 14 ఏళ్ళుపైనే అవుతోంది. పెళ్లి తరువాత కూడా నటిస్తూ.. తన ఇమేజ్ ను అలాగే కాపాడుకుంటూ వస్తోంది ఐశ్వర్య రాయ్.
Is there a storm between Aishwarya Rai and Abhishek
ఈక్రమంలో అటు ఫ్యామిలీ.. ఇటు సినిమాలు.. మరోవైపు సోషల్ మీడియాతో బిజీ బిజీగా మారిపోయింది ఐశ్వర్య. ఇక ఇంటికి సబంధించిన పనులు అన్నీ ఆమె చక్కబెడుతుందంటున్నారు ఐశ్వర్యరాయ్ భర్త అభిషేక్ బచ్చన్. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ దంపతుల ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ఆరాధ్య. రీసెంగ్ గా ఆరాధ్య 13వ ఏటలోకి అడుగు పెట్టింది.
Aishwarya Rai Abhishek Bachchan
అయితే బిగ్ బీ వారసురాలు టీనేజీలోకి అడుగు పెట్టడంతో.. పేరెంటింగ్ టిప్స్ ను పంచుకోవాలంటూ ఓ మీడియా సంస్థ అభిషేక్ బచ్చన్ ను కోరింది. ఎదురు తిరిగే స్వభావంతో ఉండే టీన్స్ ను ఎలా నియంత్రించాలంటూ ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఇక దీనిపై అభిషేక్ స్పందిస్తూ.. పేరెంటింగ్ విషయానికొస్తే ఇంట్లో తానేమీ పెద్ద పాత్ర పోషించనని స్పష్టం చేశారు. తన జీవిత భాగస్వామి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఈ వ్యవహారాలన్నింటినీ చూసుకుంటుందని అసలు విషయాన్ని వెల్లడించారు.
ఏవైనా పేరెంటింగ్ టిప్స్ ను పంచుకుంటారా? అన్న ప్రశ్నకు.. ‘‘నేటి తరం చాలా వేగంగా పరిణతి సాధిస్తోంది. మనం ఈ రోజు ఈ స్థాయికి ఎలా చేరుకున్నామనే దాని వెనుకనున్న ప్రక్రియను చూడలేని ప్రపంచంలో వారు జన్మిస్తున్నారు. నాకు మేనల్లుడు, మేనకోడలు ఉన్నారు. వారికి పదో ఏట రాగానే మొబైల్ ఫోన్ ఇచ్చేశారు. వేళ్లపై సమాచారం లభించే ప్రపంచంలోకి వారు వస్తున్నారు.
నేను మొదటిసారి తాజ్ మహల్ ను చూసినప్పుడు ఊపిరి ఆడలేదు. కానీ ప్రస్తుత తరానికి ఆ అనుభవం ఉండడం లేదు. ఎందుకంటే వారు ముందే ఇంటర్నెట్ లో చూసేస్తున్నారు’’ అని అభిషేక్ బచ్చన్ వివరించాడు. తన భార్య ఇంటి బాధ్యతలు అన్నింటినీ చూసుకుంటూ, తనను పని చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెప్పాడు.