ప్రియుడితో అమీర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ గా పేరుతెచ్చుకున్న అమీర్ ఖాన్ తనయ ఐరా ఖాన్ ఎంగేజ్‌మెంట్ అయ్యింది. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ నుపుర్ షికారేతో నిశ్చితార్థం శుక్రవారం ముంబయిలో జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అమీర్ ఖాన్(Aamir Khan) మొదటి భార్య రీనా దత్తాల కూతురు ఐరా ఖాన్(Ira Khan) గత కొన్ని రోజులుగా ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ షికారే(Nupur Shikhare)తో ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఓపెన్‌గానే ప్రేమించుకుంటున్నారు. డేటింగ్ చేస్తున్నారు. కలిసి చాలా సందర్భాల్లో ఫోటోలకు పోజులిచ్చింది. ఇంటెన్స్ పోజులతో మతిపోగొట్టారు.
త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా శుక్రవారం వీరిద్దరికి ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఎంగేజ్‌మెంట్ జరిగింది. ముంబయిలోని ఓ ప్రైవేట్ వేదికలో ప్రైవేట్గా వీరి నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వీరి ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. (Ira Khan Nupur Shikhare Engagement Photos)
ఎంగేజ్‌మెంట్ వేదిక వద్దకు వెళ్తున్న సమయంలో వీరంతా కెమెరాలకు చిక్కారు ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఐరాఖాన్, నుపురు షికారే ఎంగేజ్‌మెంట్‌ని తెలియజేస్తున్నాయి. అయితే ఇందులో వీరి లుక్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. పార్టీ వేర్లో అదరగొడుతున్నారు.
ఐరా ఖాన్ రెడ్ డ్రెస్‌లో రేడియంట్ లుక్‌లో కట్టిపడేస్తుంది. జబ్బల కిందకి ఉన్న రెడ్ గౌన్‌లో సూపర్ హాట్‌గా ఉంది ఐరా ఖాన్. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. హాలీవుడ్ హీరోయిన్‌ని తలపిస్తుంది. ఇక నుపుర్ బ్లూ సూట్‌లో అదరగొడుతున్నాడు. వీరి జంట చూడముచ్చటగా ఉండటం విశేషం.
మరోవైపు గోదుమ కలర్ కుర్తాలో అమీర్ ఖాన్ కనిపిస్తున్నారు. ఆయన కోరమీసంతో తెల్లగెడ్డం, స్టయిలీష్ హెయిర్ స్టయిలీష్‌తో సరికొత్తగా ఉన్నారు. ఎప్పుడూ చూడని లుక్‌లో కనిపిస్తున్నారు. అమీర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
వారితోపాటు అమీర్ మొదటి భార్య రీనా దత్తా, అలాగే రెండో భార్య కిరణ్ రావు, కుమారుడు, అలాగే `థగ్స్ ఆఫ్ హిందుస్థాన్` నటి ఫాతిమా సనా షేక్, ఇతర దగ్గరి బంధుమిత్రులు, ఫ్రెండ్స్ ఈ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఆ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
ఐరా ఖాన్, నుపుర్ రెండుమూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అమీర్ ఖాన్ కి ఫిట్ నెస్ ట్రైనర్‌గా పనిచేసే నుపుర్‌ని చూసి ఇష్టపడింది ఐరా. ఇద్దరు కలుస్తుండటంతో ప్రేమ పెరిగింది. ఆ ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది.
ఆ మధ్య ఐరా ఖాన్ బర్త్ డే పార్టీలో స్విమ్మింగ్ పూల్‌లో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఐరా ఖాన్ బికినీలో కనిపించడం పెద్ద వివాదంగా, సంచలనంగా మారింది. దీనిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అనేక విమర్శలు వచ్చాయి. కానీ వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగింది ఐరా ఖాన్.
తమ రిలేషన్ విషయంలో ఐరా ఖాన్ మొదట్నుంచి బోల్డ్ గానే ఉంది. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగింది. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుని హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. సెప్టెంబర్‌లో ఐరాకి నుపుర్ ప్రపోజ్ చేయగా, ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక పెళ్లిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇందులో ఫాతిమా సనా షేక్(Fathima Sana Shaik) హాజరు కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. `థగ్స్ ఆఫ్ హిందూస్థాన్` నుంచి అమీర్ ఖాన్, ఫాతిమా ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ వినిపించాయి. కిరణ్ రావుకి డైవర్స్ ఇవ్వడం కూడా ఇదే కారణమనే టాక్ వినిపించింది. దీంతో ఇప్పుడు ఆమె అమీర్ కూతురు పెళ్లిలో సందడిచేయడంతో మరోసారి చర్చకి తెరలేపినట్టయ్యింది.