- Home
- Entertainment
- LaalSinghChaddha Review:లాల్ సింగ్ చడ్డా ప్రీమియర్ షో టాక్.. బాలీవుడ్ కి కొత్త ఊపిరి, చైతు ఎలా నటించాడంటే
LaalSinghChaddha Review:లాల్ సింగ్ చడ్డా ప్రీమియర్ షో టాక్.. బాలీవుడ్ కి కొత్త ఊపిరి, చైతు ఎలా నటించాడంటే
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంతో చైతు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య ఈ చిత్రంలో చిన్న పాత్రలోనే నటిస్తున్నప్పటికీ కథకి చాలా కీలకమైన పాత్ర.

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంతో చైతు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య ఈ చిత్రంలో చిన్న పాత్రలోనే నటిస్తున్నప్పటికీ కథకి చాలా కీలకమైన పాత్ర. అమీర్ ఖాన్ తో కలసి చైతు ఈ చిత్రంలో సైనికుడిగా నటిస్తున్నాడు. ఈ మూవీలో వీరిద్దరూ స్నేహితులు. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది.
దీనితో సోషల్ మీడియాలో ఈ చిత్రంపై పెద్ద హంగామానే సాగుతోంది. ఎప్పటిలాగే కొందరు నెటిజన్లు అమీర్ ఖాన్ కి వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని ట్రెండ్ చేస్తున్నారు. మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. తొలిసారి అమీర్ ఖాన్ తన చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రజెంట్ చేస్తుండడం విశేషం.
ఇక లాల్ సింగ్ చడ్డా ప్రీమియర్ షోలు ప్రపంచ వ్యాప్తంగా మొదలయ్యాయి. దుబాయ్, యూఎస్ ప్రాంతాల ప్రీమియర్స్ నుంచి ఈ చిత్రానికి టాక్ కూడా మొదలైంది. సినిమాని చూసిన వారు ఎమోషనల్ గా అద్భుతంగా ఉన్నట్లు చెబుతున్నారు. 1994లో విడుదలైన 'ఫారెస్ట్ గంప్' అనే హాలీవుడ్ చిత్రానికి ఇది అఫీషియల్ రీమేక్. రీమేక్ అయినప్పటికీ దర్శకుడు అద్వైత్ చందన్ ఈ చిత్రానికి ఇండియన్ నేటివిటీకి అడాప్ట్ చేసుకున్న విధానం చాలా బావుంది.
ఒరిజినల్ వర్షన్ లో చాలా మార్పులు చేసి లాల్ సింగ్ చడ్డా రూపొందించారు. ఆ మార్పులు బ్రిలియంట్ గా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. ఒక వేళ ప్రేక్షకులు ఒరిజినల్ వర్షన్ చూసినప్పటికీ.. లాల్ సింగ్ కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని అంటున్నారు. ఇంటర్వెల్ లో వచ్చే పాయింట్ థ్రిల్ చేస్తుంది అని అంటున్నారు.
ఇక సెకండ్ హాఫ్ ఎంతో ఆహ్లాదంగా, ఎమోషనల్ గా సాగుతుంది. నాగ చైతన్యతో అమీర్ ఖాన్ బ్రొమాన్స్.. కరీనా కపూర్ తో రొమాన్స్ సినిమాకి హైలైట్. వరుసగా పరాజయాలతో సాగుతున్న బాలీవుడ్ కి లాల్ సింగ్ చడ్డా కొత్త ఊపిరినిచ్చే చిత్రం అనే టాక్ వినిపిస్తోంది.
నాగ చైతన్య నటనకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగ చైతన్య అభిమానులకు అతడి రోల్ తప్పకుండా మంచి సంతృప్తినిస్తుంది అని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా చిన్న కామియో రోల్ లో నటించారు.
ఈ చిత్రంతో దర్శకుడు ప్రేక్షకుల హృదయాలు టచ్ చేసే ప్రయత్నం చేశారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా లాల్ సింగ్ చడ్డా చిత్రంలో నటీనటుల పెర్ఫామెన్స్ లు అద్భుతంగా ఉంటాయి. ఎమోషనల్ కథలో అమీర్ ఖాన్ లాంటి నటుడు నటిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూస్తారు. నటుడిగా నాగ చైతన్యని మరో మెట్టు ఎక్కించే చిత్రం అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.