- Home
- Entertainment
- Varsha : వర్షను దుర్భాషలాడిన వ్యక్తి.. అల్లు అర్జున్ థియేటర్ వద్ద ఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ నటి
Varsha : వర్షను దుర్భాషలాడిన వ్యక్తి.. అల్లు అర్జున్ థియేటర్ వద్ద ఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ నటి
బుల్లితెర నటి వర్ష (Jabardasth Varsha)కు ఓ ఛేదు అనుభవం ఎదురైంది. అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ దగ్గర అవడంతో వర్ష ఓ భావోద్వేగమైన వీడియో షేర్ చేసింది. తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకుంటూ కాస్తా ఫైర్ అయ్యింది.

జబర్దస్త్ కామెడీ షోతో వర్ష ఎంతలా పాపులర్ అయ్యిందో తెలిసిందే. బుల్లితెరపై తన నటన, పెర్ఫామెన్స్ తో ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఆయా ఈవెంట్లలోనూ స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ వస్తోంది.

మరోవైపు సోషల్ మీడియాలోనూ వర్ష ఎంతగానో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ షాకింగ్ వీడియోను పంచుకుంది. తనకు ఎదురైన చేధు ఘటనను వివరించింది.
ఆమె విడుదల చేసిన వీడియో ప్రకారం.. తాజాగా వర్ష ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun కు సంబంధించిన AAA థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లింది. అక్కడ తన కారును వాలెంట్ పార్కింగ్ కు ఇచ్చింది. తిరిగి సినిమా చూసి వచ్చి తీసుకునేందుకు అవుట్ సైడ్ వేచి ఉంది.
అయితే, కారు వచ్చే లోపు వేచి ఉన్న సమయంలో ఓ వ్యక్తి వర్షపై దుర్భాషలాడాడని చెప్పుకొచ్చింది. అతని ప్రవర్తన, మాటలు తనను ఎంతో బాధించాయని చెప్పుకొచ్చాయి.ఆ వ్యక్తి ఫ్యామిలీ ముందే బూతులు మాట్లాడటం బాధాకరమన్నారు. అతని చేష్టలకు చాలా భయమేసిందని కూడా చెప్పింది. అయినా ఆ వ్యక్తి ప్రవర్తననను ప్రశ్నించినట్టు తెలిపింది.
కానీ అదే పరిస్థితితో వేరే అమ్మాయి ఉంటే పరిస్థితి ఏంటనీ? అలా దుర్భాషలాడితే అమ్మాయిలు ఎలా తీసుకుంటారని? పబ్లిక్ ఆ వ్యక్తి అలా ప్రవర్తించడం వల్ల సొసైటీపై ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.
తనను ఆ వ్యక్తి దుర్భాషలాడటంతో కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియోను విడుదల చేసింది. ఆ వ్యక్తి ఫొటోను కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేస్తానని చెప్పింది. అలాగే ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని కోరుకుంది. దయచేసి ఇలాంటి వాటి వల్ల ఏదోక కుటుంబం బాగా బాధపడుతుందని చెప్పింది.