- Home
- Entertainment
- కూతురిని కలిసిన కళ్యాణ్ దేవ్... భార్య శ్రీజతో విడాకుల వార్తల నేపథ్యంలో ఆసక్తికర సంఘటన!
కూతురిని కలిసిన కళ్యాణ్ దేవ్... భార్య శ్రీజతో విడాకుల వార్తల నేపథ్యంలో ఆసక్తికర సంఘటన!
శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడిపోయారనేది నిజం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ పరిణామాలు ధృవీకరిస్తున్నాయి. సోషల్ మీడియా అకౌంట్స్ లో తన పేరు మార్చేసిన శ్రీజ.. కళ్యాణ్ అనే ట్యాగ్ తొలగించేసింది. అలాగే కళ్యాణ్ దేవ్ ని అన్ ఫాలో చేసింది.

Sreeja Kalyan dev
ఆరు నెలలకు పైగా కళ్యాణ్ దేవ్-శ్రీజ(Sreeja Konidela) విడివిడిగా ఉంటున్నారు. శ్రీజ తండ్రి చిరంజీవి వద్ద ఉంటుంటే... కళ్యాణ్ దేవ్ పేరెంట్స్ తో కలిసి ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఫ్యామిలీ వేడుకల్లో వీరు కలిసి కనిపించలేదు. శ్రీజ పెద్ద కుమార్తె బర్త్ డే వేడుకల్లో కళ్యాణ్ దేవ్ కనిపించలేదు. అలాగే కళ్యాణ్ దేవ్ తన తల్లి బర్త్ డే జరుపగా... శ్రీజ హాజరు కాలేదు.
అలాగే కళ్యాణ్ దేవ్(Kalyan Dev) చిత్రాలను హీరోగా ఆయన కెరీర్ ని చిరంజీవి(Chiranjeevi) ఫ్యామిలీ పట్టించుకోవడం లేదు. శ్రీజను వివాహం చేసుకున్నాక కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి హిట్ చిత్రాల్లో ఒకటైన విజేత టైటిల్ తో మూవీ చేసిన కళ్యాణ్ దేవ్ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాకు చిరంజీవి ప్రచారం కల్పించారు.
Kalyan dev
శ్రీజతో విబేధాల అనంతరం కళ్యాణ్ దేవ్ చేసిన రెండు చిత్రాలకు చిరంజీవి కుటుంబం నుండి ఏ ఒక్కరూ సపోర్ట్ ఇవ్వలేదు. 2022 సంక్రాంతి కానుకగా సూపర్ మచ్చి చిత్రం విడుదల చేశారు. ఆ మూవీ విజయం సాధించలేదు. మూడో చిత్రం కిన్నెరసాని నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. చిరంజీవి ఫ్యామిలీతో కటీఫ్ అయిన కళ్యాణ్ దేవ్ కెరీర్ ముగిసినట్లే అన్న వాదన వినిపిస్తుంది.
మరోవైపు శ్రీజ మూడో పెళ్ళికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడిని శ్రీజ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. ఈ పెళ్లి పట్ల సుముఖంగా లేని చిరంజీవి కూతురి కోసం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారనేది టాలీవుడ్ వర్గాల వాదన.
ఈ క్రమంలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. శ్రీజ, కళ్యాణ్ దేవ్ సంతానమైన కూతురు నవిష్క తండ్రి వద్దకు వచ్చింది. ఎడబాటు తర్వాత నవిష్క తల్లి శ్రీజ వద్దే ఉంటున్నట్లు సమాచారం. సడన్ గా చిన్నారి తండ్రి కళ్యాణ్ దేవ్ తో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కళ్యాణ్ దేవ్ తన ఇంస్టాగ్రామ్ లో నావిష్క తో ఆహ్లాదంగా గడుపుతున్న వీడియో షేర్ చేశారు.
Sreeja Kalyan dev
దీంతో శ్రీజ, కళ్యాణ్ దేవ్ కలిసిపోయారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అదే సమయంలో విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లలను చూసుకునే బాధ్యత ఇద్దరికీ ఉంటుంది. కోర్ట్ అనుమతి మేరకు కూతురు నవిష్క ను కలిసే అవకాశం కళ్యాణ్ దేవ్ కి దక్కి ఉండవచ్చు. ఈ వీడియోలో శ్రీజ లేకపోవడం గమనార్హం.
Sreeja Kalyan dev
శ్రీజ, కళ్యాణ్ దేవ్ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారా? విడివిడిగా మాత్రమే ఉంటున్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. అయితే శ్రీజ, కళ్యాణ్ విడాకులు తీసుకున్నారని, ఆ విషయం అధికారికంగా ప్రకటించడానికి చిరంజీవి ఇష్టపడటం లేదనేది ఇండస్ట్రీ టాక్. గతంలో శ్రీజ పెద్దవాళ్ళను ఎదిరించి ప్రేమించినవాడిని వివాహం చేసుకుంది. అనంతరం అతనితో విడాకులు తీసుకొని విడిపోయారు.