MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Yami Gautam: తరుణ్, నితిన్, శిరీష్ తో అన్నీ ఫ్లాపులే.. జాతీయ ఉత్తమ నటి యామి గౌతమ్ గురించి ఈ విషయాలు తెలుసా ?

Yami Gautam: తరుణ్, నితిన్, శిరీష్ తో అన్నీ ఫ్లాపులే.. జాతీయ ఉత్తమ నటి యామి గౌతమ్ గురించి ఈ విషయాలు తెలుసా ?

జాతీయ ఉత్తమ నటిగా యామి గౌతమ్ అవార్డు గెలుచుకుంది. ఆర్టికల్ 370 చిత్రానికి గాను ఆమెకి ఈ అవార్డు దక్కింది. యామి గౌతమ్ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 19 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉత్తమ నటిగా యామి గౌతమ్
Image Credit : Asianet News

ఉత్తమ నటిగా యామి గౌతమ్

నటి యామి గౌతమ్ ఊహించని విధంగా జాతీయ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఆమె నటించిన ఆర్టికల్ 370 చిత్రానికి గాను ఈ అవార్డు దక్కింది. దీనితో దేశం మొత్తం సినీ అభిమానులు యామి గౌతమ్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనితో యామి గౌతమ్ కి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యామి గౌతమ్ తెలుగు సినిమాలు
Image Credit : Asianet News

యామి గౌతమ్ తెలుగు సినిమాలు

యామి గౌతమ్ తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. ఆమె తెలుగులో నాలుగు చిత్రాల్లో నటించింది. 2011లో యామి గౌతమ్ నువ్విలా చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. కానీ ఆ తర్వాత యామి గౌతమ్ తెలుగులో నటించిన సినిమాలన్నీ తీవ్రంగా నిరాశ పరిచాయి.

35
యువ హీరోలతో నటించిన యామి గౌతమ్
Image Credit : Instagram

యువ హీరోలతో నటించిన యామి గౌతమ్

అల్లు శిరీష్ కి జోడీగా యామి గౌతమ్ గౌరవం మూవీలో నటించింది. ఇది శిరీష్ కి డెబ్యూ మూవీ. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత లవర్ బాయ్ తరుణ్ కి జోడీగా యుద్ధం మూవీలో నటించింది. అది కూడా ఫ్లాపే. చివరగా యామి గౌతమ్ తెలుగులో నటించిన మూవీ కొరియర్ బాయ్ కళ్యాణ్. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2015లో విడుదలైంది. ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ తర్వాత యామి గౌతమ్ టాలీవుడ్ లో కనిపించలేదు.

45
ఆదిత్య ధర్ తో ప్రేమ, వివాహం
Image Credit : social media

ఆదిత్య ధర్ తో ప్రేమ, వివాహం

ఆ తర్వాత ఆమె హిందీ సినిమాపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. 2019లో యామి గౌతమ్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఉరి ది సర్జికల్ స్ట్రైక్ మూవీలో కీలక పాత్రలో నటించింది. ఆ చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఏర్పడ్డ పరిచయంతో యామి గౌతమ్, ఆదిత్య ధర్ ప్రేమలో పడ్డారు. 2021లో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా యామి గౌతమ్ సినిమాలు కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది.

55
ఆర్టికల్ 370 మూవీలో అద్భుత నటన
Image Credit : instagram

ఆర్టికల్ 370 మూవీలో అద్భుత నటన

ఈ క్రమంలోనే ఆమె నటించిన ఆర్టికల్ 370 చిత్రం 2024లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో యామి గౌతమ్ తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందుకే జాతీయ ఉత్తమ నటిగా నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది. దీనితో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు యామి గౌతమ్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image2
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Recommended image3
Nani: ఇలాంటి సినిమాలెందుకు చేస్తున్నావ్‌.. నానికి అమ్మ వార్నింగ్‌.. జడల వివాదంపై ఎట్టకేలకు వివరణ
Related Stories
Recommended image1
OTT Thriller: కోడలి అక్రమ సంబంధం గుట్టురట్టు, ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. అస్సలు మిస్ కావొద్దు
Recommended image2
Naga Chaitanya: నాగ చైతన్యకి ఆస్తులు ఎలాగూ ఉన్నాయి, కానీ అలా చేస్తే నకిలీ అవుతాడు.. బాలకృష్ణ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved