MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జెనిలియా, లయ, మీరా జాస్మిన్, సోనాలీ బింద్రే... రీ ఎంట్రీకి రెడీ అయిన సీనియర్ హీరోయిన్లు ఇంకెవరంటే..?

జెనిలియా, లయ, మీరా జాస్మిన్, సోనాలీ బింద్రే... రీ ఎంట్రీకి రెడీ అయిన సీనియర్ హీరోయిన్లు ఇంకెవరంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు ఇప్పటి తారలు. హీరోలు 70 ఏళ్ళు వచ్చినా హీరోలుగానే ఉంటున్నారు.. కొత్తగా వచ్చే బ్యూటీస్ తో డ్యూయెట్లు పాడుకుంటుంటారు.  కాని హీరోయిన్లు మాత్రం 30 దాటిటే.. క్యారెక్టర్ల కోసం వెతుక్కోవల్సిన పరిస్థితి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 30 2022, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలిగి.. తెరమరుగై.. కుటుంబ బాధ్యతల్లో మునిగి తేలుతున్న చాలా మంది తారలు.. రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా 2000 ఇయర్ తరువాత హీరోయిన్లుగా పరిచయం అయ్యి.. దాదాపు పది పదిహేనేళ్ళు తెలుగు తెరను ఏలిన స్టార్స్ రీ ఎంట్రీ ప్రయత్నాలు చేస్తున్నారు. జెనిలియా, లయ,  మీరా జాస్మిన్, సోనాలీ బింద్రే... రీ ఎంట్రీకి రెడీ అయిన సీనియర్ హీరోయిన్లు ఎవరెవరంటే..? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

జెనీలియా.. రెడీ, ఢీ,హ్యాపీ,  బొమ్మరిల్లు లాంటి హిట్ సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ గా వెలిగిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ హీరో.. మాజీ ముఖ్యమంత్రి తనయుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకుని. ఇద్దరు పిల్లలతో ముంబయ్ లో హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ఓ తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. 
 

38

ఇక మన్మధుడు, మురారీ,ఖడ్గం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో .. సూపర్ హిట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన హీరోయిన్ సోనాలీబింద్రే. మొన్నటి వరకూ క్యాన్సర్ తో పోరాడి.. చావు నుంచి తప్పించుకున్న ఈ సీనియర్ హీరోయిన్.. మళ్లీ రీ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటుంది. తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తోంది. 

48

ఇక తెలుగులో గ్లామర్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన మలయాళ బ్యూటీ మీరా జాస్మిన్ కూడా మరో సారి టాలీవుడ్ లో సందడి చేయబోతుంది. రామ్,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోతోన్న యాక్షన్ మూవీలో ఈ భామ నటించబోతున్నట్టు సమాచారం. 

58

వెళ్లవయ్య వెళ్లూ.. అంటూ జయం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో పాతుకుపోయిన సదా.. హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయిపోయాక టీవి షోస్ చేసుకుంటూ.. గడిపేస్తోంది.. ఇంకా పెళ్లి కూడా చేసుకోని సదా.. ముంబయ్ లో సింగిల్ గా ఉంటోంది. ఇక త్వరలో టాలీవుడ్ లో నటించడానికి ప్రయత్నం చేస్తోందని సమా చారం. 

68

టాలీవుడ్ తెరపైకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న మరో హీరోయిన్ కలర్స్ స్వాతి, అష్టా చమ్మ నుంచి.. స్వామిరారా వరకు ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన కలర్స్ స్వాతి... పెళ్ళి తరువాత ఫారెన్ లో సెటిల్ అయ్యింది.  చాలా ఏళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ పంచ తంత్ర సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది స్వాతి. 

78

ఇక తెలుగు తెరపై అచ్చ తెలుగు హీరోయిన్ గా.. ఫ్యామిలీ ఆడియ్స్ ను దగ్గరయిన స్టార్ లయ్. ఆమె కూడా చాలా కాలం క్రితం పెళ్లి చేసుకుని కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన కూతురు తో కలిసి డాన్స్ వీడియోలతో సందడి చేస్తోంది. అంతే కాదు త్వరలో ఇండియాకు వచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించబోతున్నట్టు సమాచారం. 

88

హాయ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి.. సంబరం లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది నిఖిత. ఈ హీరోయిన్ కూడా త్వరలో టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఇప్పటికే టాలీవుడ్ లోకి భూమిక, నదియా, టబు లాంటి వారు రీ ఎంట్రీ ఇచ్చి... గ్లామర్ మధర్ పాత్రల్లో మెరుపులు మెరిపిస్తున్నారు. మరి ఈతారలు ఎం చేస్తారో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Thalaivar 173: రజినీకాంత్ సినిమాకు మళ్ళీ డైరెక్టర్ మారాడా? రాజ్ కమల్ సంస్థ సంచలన వీడియో
Recommended image2
Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Recommended image3
Peddi Hit Target: పెద్ది మూవీ సక్సెస్‌ కావాలంటే ఎన్నికోట్లు రావాలో తెలుసా? పెద్ద రిస్కే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved