'కేజీఎప్ -2' : తెలుగు రైట్స్ కి ఎంత అడుగుతున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్
కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ -బాక్సాఫీస్ బ్లాక్‌బస్టరైన విషయం తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడింది. దాంతో ఈ చిత్రం సీక్వెల్ పై అందరి దృష్టీ ఉంది. కన్నడం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ వసూళ్లు రాబట్టిన కేజీఎఫ్ ఫ్రాంచైజీలో వస్తున్న సీక్వెలే -కేజీఎఫ్ చాప్టర్ 2. కథాకోణాన్ని దృష్టిలో పెట్టుకుని తొలుత కోలార్ గోల్డ్ మైన్స్‌లోనే షూటింగ్ మొదలెట్టినా -పర్యావరణానికి హాని కలుగుతుందన్న అభ్యంతరాల నేపథ్యంలో అప్పట్లో షూటింగ్ ఆగిపోయింది. అయితే ఆ గ్యాప్‌ని ఫిల్ చేస్తూ కేజీఎప్ చాప్టర్ 2 శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న అప్‌డేట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ నెట్టింట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఆమధ్య కోలార్ గోల్డ్ మైన్స్ నుంచి షూటింగ్‌ను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేసి -భారీ సెట్ల మధ్య యాక్షన్ పార్ట్ పూర్తి చేసేశారు. ఇక చివరి భారీ షెడ్యూల్‌ను బెంగళూరులో నిర్వహించి, రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. కోలార్ బంగారు గనులపై వరల్డ్ మాఫియా ఎలా కన్నేసిందన్న కోణంలో కథను చెబుతూ -ఫస్ట్ చాప్టర్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల్ని చూపించిన దర్శకుడు నీల్ నితిన్, అంతకుమించి చాప్టర్ 2లో యాక్షన్ ఎడిసోడ్స్ తెరకెక్కించాడని అంటున్నారు.
కేజీఎఫ్ పార్ట్ 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్ 2’ ని ఎక్కడా రాజీ పడకుండా హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
యితే ఈ టీజర్ సోషల్ మీడియాలో రెకార్డ్ లు తిరగరాస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది టీజర్. 12 గంటల వ్యవధిలోనే 17 మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోయింది ఈ టీజర్. మరోవైపు లైక్స్ తో మరో సెన్సేషనల్ రికార్డులను సొంతం చేసుకుంది. ఇక టీజర్ ఈ రేంజ్ లో ఉంటె ఇక ట్రైలర్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అభిమానులు. కేజీఎఫ్ 1ను మించి పార్ట్ 2 ఉండనుందని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
కేజీఎఫ్ చాప్టర్ మరింత సక్సెస్ సాధించగలదన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. దాంతో ఈ చిత్రం తెలుగు వెర్షన్ రైట్స్ కు ఓ రేంజిలో క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదల జీజర్ దుమ్మురేపింది. ఈ నేపధ్యంలో ఈ హైప్ తో ఈ సినిమా రైట్స్ తీసుకుందామనుకునే వారికి కేజీఎఫ్ నిర్మాతలు అరవై కోట్లు చెప్పి షాక్ ఇచ్చారట.
కేవలం గుంటూరు రైట్స్ కై 5 కోట్లు అడిగారని వినికిడి. కెజీఎఫ్ మొదటి పార్ట్ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఐదు కోట్లకు తీసుకున్నారు. దాదాపు 12 కోట్ల రూపాయలు ఆ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడు అరవై కోట్లు అడుగుతున్నారు.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని, అంత రేటు పెట్టి తెలుగు రైట్స్ ఎవరు తీసుకుంటారు అనే డిస్కషన్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కావాలనే హైప్ క్రియేట్ చేయటానికి ఇలాంటి న్యూస్ లు క్రియేట్ చేస్తున్నారంటున్నారు.
ఇప్పుడున్న కరోనా పరిస్దితుల్లో అంతంత రేటు పెట్టి కొంటే రికవరీలు కష్టం అని, అందుకే అంతంత పెట్టే ధైర్యం చేయటం కష్టమే అంటున్నారు.కాకపోతే బేరసారాలు గట్టిగాజరుగుతాయని, పోటీకూడా ఓ రేంజిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దానికి తోడు మనకు సీక్వెల్స్ హిట్టైన ధాకలాలు తక్కువ. ఎంతో హైప్ తో వచ్చిన సీక్వెల్స్ ఆ స్దాయిలో నిలబడలేదని కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎవరేమన్నా కేజీఎఫ్ 2 కు ఉన్న క్రేజ్ మాత్రం తక్కువ అంచనా వేయలేమనేది నిజం.
సినిమాలో విలన్ గా నటించిన గరుడ పాత్రధారి గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన అసలు పేరు రామ్. అతడు నటుడు కాదట హీరో యష్ బాడీగార్డ్ అట. అంతే కాదు యష్ కు అతడు చాలాకాలం నుంచి సన్నిహితుడు. ఇక వీరిద్దరూ ఏదైనా చిత్రంలో కలిసి నటించాలని అనుకున్నారట. దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ గురించి యష్‌తో చర్చిండానికి వెళ్లినప్పుడు అక్కడ రామ్‌ని చూశారు. ‘గరుడ’ పాత్రకు సరిపోతాడని భావించి.. ఆడిషన్స్‌కి రావాల్సిందిగా కోరారు.
సినిమాల్లో కండలు తిరిగిన హీరోగా కనిపించే యష్ నిజ జీవితంలో మాత్రం మంచి ఫ్యామిలి మెన్‌గా ఉంటాడు. కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే యష్.. కాస్త ఖాళీ సమయం దొరికిందంటే కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ యంగ్ హీరో ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. భార్య, ఇద్దరు పిల్లలతో మాల్దీవుల్లో రాఖీ భాయ్ హల్చల్ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ టూర్‌కు సంబంధించి ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన యష్.. వాటితో పాటు ‘ఒకవేళ స్వర్గమంటూ ఉంటే.. ఇలాగే ఉంటుంది. మేము ఇప్పుడు అక్కడే ఉన్నాం’ (మాల్దీవులను ఉద్దేశిస్తూ) అనే క్యాప్షన్ జోడించాడు.