- Home
- Entertainment
- సమంత 'యశోద' చూడడానికి 5 ప్రధాన కారణాలు..లైఫ్ లో ఇన్ని ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత కూడా..
సమంత 'యశోద' చూడడానికి 5 ప్రధాన కారణాలు..లైఫ్ లో ఇన్ని ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత కూడా..
సమంత నటించిన 'యశోద' చిత్రం మరి కాసేపట్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. హరీష్ - హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కేవలం సమంతకి ఉన్న క్రేజ్ ఆధారంగానే ఈ చిత్రానికి ఇంత మంచి బజ్ ఏర్పడింది.

సమంత నటించిన 'యశోద' చిత్రం మరి కాసేపట్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. హరీష్ - హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కేవలం సమంతకి ఉన్న క్రేజ్ ఆధారంగానే ఈ చిత్రానికి ఇంత మంచి బజ్ ఏర్పడింది. ప్రేక్షకులు ఈ చిత్రంపై ఆసక్తి చూపడానికి ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఉన్న 5 కారణాల గురించి తెలుసుకుందాం.
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత నుంచి వస్తున్న కంప్లీట్ మూవీ ఇది. ఆ మధ్యన కన్మణి రాంబో ఖతీజా చిత్రం విడుదలయింది. అయితే అది తమిళ చిత్రం కావడంతో ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. యశోద చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. సమంత మెయిన్ లీడ్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. చైతూతో బ్రేకప్ తర్వాత వస్తుండడంతో ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. దీనిని మొదటి కారణంగా చెప్పుకోవచ్చు.
ఇక రెండవ కారణం సమంత హెల్త్ కండిషన్. ఇటీవల కొంత కాలంగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆ మధ్యన అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చింది. యశోద ప్రమోషన్స్ లో కూడా సమంత బాగా నిరసించి పోయి కనిపించింది. తన పరిస్థితి గురించి ఎమోషనల్ అయింది. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళుతూనే ఉంటా అని సమంత దృఢంగా నిశ్చయించుకుంది.
యశోద చిత్రం పట్ల ప్రేక్షకులు ఆసక్తిగా ఉండడానికి మూడవ కారణం యాక్షన్ సీన్స్. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత ఆ స్థాయిలో ఈ చిత్రంలో సమంత యాక్షన్ సీన్స్ లో నటించింది. పైగా ఆమె ఆరోగ్యం సరిగా లేని సమయంలో ఈ చిత్ర షూటింగ్ జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ యాక్షన్ సీన్స్ లో ఎలా మెప్పించింది అనే ఉత్కంఠ నెలకొంది.
ఇక నాల్గవ కారణంగా చెప్పుకోవాలంటే అది సరోగసి. ఇటీవల సెలెబ్రిటీల విషయంలో సరోగసి అనేది బాగా వినిపిస్తోంది. రీసెంట్ గా సరోగసి ద్వారా పిల్లలని పొందిన వ్యవహారంలో నయన్ విగ్నేష్ దంపతులు కూడా వివాదంలో చిక్కుకున్నారు. దీనితో సరోగసి గురించి తెలుసుకోవడానిక ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.
యశోద చిత్ర రిజల్ట్ పైనే సమంత కెరీర్ ఆధారపడి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దీనినే ఐదవ కారణంగా చెప్పుకోవచ్చు. పెళ్లి తర్వాత కూడా సమంత బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. జీవితంలో వరుస దెబ్బల తర్వాత సామ్ నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం విజయం సాధిస్తే సమంతకి మానసికంగా ఎంతో బలం చేకూరినట్లు అవుతుంది.
మరి యశోద చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో మరికొన్ని గంటల్లో తేలనుంది. తన గ్లామర్ పక్కన పెట్టి సమంత కథని నమ్ముకుని చేస్తున్న చిత్రం యశోద. ఈ చిత్రం విజయం సాధిస్తే ఆమె మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉంది.