Tollywood 2023 Controversies: టాలీవుడ్ ని షేక్ చేసిన వివాదాలు!
చిత్ర పరిశ్రమలో వివాదాలు చాలా కామన్. 2023లో కూడా కొన్ని గొడవలు పరిశ్రమను షేక్ చేస్తాయి. పలువురు సెలెబ్స్ పతాక శీర్షికలకు ఎక్కారు. ఈ లిస్ట్ లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, సమంత, దిల్ రాజు, అనసూయ, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు ఉన్నారు.

Tollywood 2023 Controversies
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో బాలకృష్ణ ఒకప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ అక్కినేని తొక్కినేని అన్నారు. ఇది అక్కినేని అభిమానుల మనోభావాలు దెబ్బతీసింది. నాగేశ్వరరావును బాలకృష్ణ అవమానించారు. క్షమాపణలు చెప్పాలని అక్కినేని ఫ్యాన్స్ ధర్నాలు చేశారు. నాగ చైతన్య, అఖిల్ సైతం సున్నితంగా సోషల్ మీడియా ద్వారా ఖండించారు. బాలకృష్ణ మాత్రం క్షమాపణలు చెప్పలేదు.
Tollywood 2023 Controversies
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు దిల్ రాజు-సి.కళ్యాణ్ మధ్య మాటల యుద్దానికి దారి తీశాయి. చిన్న నిర్మాతలను తొక్కేస్తూ వాళ్ళను దిల్ రాజు ఎదగనీయడం లేదని సి. కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు దిల్ రాజుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సి కళ్యాణ్ వీడియో బైట్ విడుదల చేశారు.
Tollywood 2023 Controversies
సమంత ఆరోగ్యం మీద నిర్మాత చిట్టిబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమంతకు వచ్చిన మయోసైటిస్ ఒక సాధారణ వ్యాధి. ఈమె ప్రతి సినిమా విడుదలకు ముందు సింపతీ కోసం అనారోగ్యం తెరపైకి తెస్తుంది. ఆమె స్టార్డం ఎప్పుడో అయిపోయింది. సమంతకు ఆఫర్స్ రావని కామెంట్ చేశారు. దీనికి సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వయసు పెరిగితే కొందరు మగాళ్ల చెవుల్లో వెంట్రుకలు పెరుగుతాయి. డాక్టర్స్ దానికి టెస్టోస్టిరాన్ కారణం అని చెబుతారు. అవి తొలగించుకుంటే మంచిది, అని సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. చిట్టిబాబుకు చెవుల్లో భారీగా వెంట్రుకలు ఉంటాయి.
Tollywood 2023 Controversies
అనసూయ భరద్వాజ్-విజయ్ దేవరకొండల వివాదం కూడా టాలీవుడ్ ని షేక్ చేసింది. ఖుషి చిత్ర పోస్టర్ పై 'ది విజయ్ దేవరకొండ' అని రాయడాన్ని ఆమె పరోక్షంగా ఎగతాళి చేశారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. విజయ్ ని ఉద్దేశపూర్వకంగానే నేను టార్గెట్ చేశాను. అతని వద్ద పనిచేసే వ్యక్తి డబ్బులు ఇచ్చి నాపై దుష్ప్రచారం చేయించాడని అనసూయ తర్వాత ఓ సందర్భంలో తెలిసింది. విజయ్ ప్రమేయం లేకుండా ఇది జరగదు. అందుకే నేను విమర్శలు చేశాను. ఇకపై విజయ్ తో గొడవలకు ఫుల్ స్టాప్ పెడుతున్నానని అనసూయ అన్నారు.
Tollywood 2023 Controversies
ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం సంచలన విజయం సాధించింది. దిల్ రాజు కూతురు ఈ చిత్ర నిర్మాత. అయితే చిత్ర కథ నాదే, బలగం వేణు కాపీ చేశాడని జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఆరోపణలు చేశాడు. గతంలో నేను రాసిన పచ్చికి అనే కథకు స్వల్ప మార్పులు చేసి బలగం తెరకెక్కించారని ఆరోపణలు చేశాడు. వేణు ఈ కామెంట్స్ ఖండించారు. తన కుటుంబంలో వంద మంది సభ్యులు ఉంటారు. సొంత అనుభవాలతో రాసుకున్న కథ అని వేణు సమాధానం చెప్పారు. కోర్టులో తేల్చుకోమని సవాలు విసిరారు.
Tollywood 2023 Controversies
సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ లు నటించిన బ్రో మూవీ వివాదాలకు దారి తీసింది. ఆ చిత్రంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును గుర్తు చేస్తూ ఓ సాంగ్ చేశారు. సంక్రాంతి వేడుకల్లో అంబటి రాంబాబు డాన్సు చేసిన వీడియో ఆధారంగా స్పూఫ్ రూపొందించారు. దీనిపై మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. బ్రో మూవీలో 30 ఇయర్స్ పృథ్వి చేసిన పాత్రకు అంబటి రాంబాబుకు సంబంధం లేదని యూనిట్ క్లారిటీ ఇచ్చారు.
మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. మనోజ్ పెళ్ళికి కూడా విష్ణు రాలేదు. వివాహం జరిగిన కొద్దిరోజులకు విష్ణు నా మనుషుల మీద దాడి చేస్తున్నాడని మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వెంటనే ఆ వీడియో డిలీట్ చేశాడు. అప్పటి వరకు వచ్చిన పుకార్లకు ఆ వీడియో బలం చేకూర్చింది. రియాలిటీ షో కోసం చేసిన ఫ్రాంక్ అని నమ్మించే ప్రయత్నం చేశాడు విష్ణు. కానీ జనాలు నమ్మలేదు. విష్ణు ఎలాంటి రియాలిటీ షో చేయలేదు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మాట్లాడలేదని జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యాన్స్ లోని ఒక వర్గం టార్గెట్ చేసింది. ఇదే విషయం బాలకృష్ణను అడిగితే ఐ డోంట్ కేర్ అన్నాడు. ఎన్టీఆర్ పై ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన నోరు విప్పలేదు. టీడీపీ క్యాడర్ లోని బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు వర్గం ఎన్టీఆర్ పై మాటల దాడికి దిగారు. నందమూరి అభిమానులు ఎన్టీఆర్, బాలయ్య వర్గాలుగా విడిపోయారు. ఎన్టీఆర్ ని తిడితే ఊరుకునేది లేదని ఫ్యాన్స్ హెచ్చరికలు జారీ చేశారు.