Chiranjeevi: చిరంజీవి చెయ్యాల్సిన పాత్రే రావు రమేష్ చేసారా?
Chiranjeevi: సందీప్ కిషన్ నటించిన 'మజాకా' సినిమా మొదట చిరంజీవితో చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. ఆ తరువాత ఈ పాత్రలో రావు రమేష్ పాత్రలో నటించారు.
- FB
- TW
- Linkdin
Follow Us

What is Chiranjeevi connection with Sundeep Kishan Majaka? in telugu
Chiranjeevi: ఓ హీరోతో అనుకున్న కథ ని మరొక హీరో చేయటం కొత్త విషయం ఏమి కాదు. కానీ మెగాస్టార్ వంటి హీరోతో అనుకున్న పాత్రను రావు రమేష్ చేయటం మాత్రం ఆశ్చర్యమే. ఇంతకీ ఏ సినిమా అంటారా.
తాజాగా సందీప్ కిషన్ చేసిన ‘మజాకా’. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఇది విడుదల కానుంది. ఈసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్‌కిషన్ స్వయంగా చిరంజీవి మొదట ఈ సినిమా చేయాలనకున్నారని కన్ఫర్మ్ చేసారు. అంతవరకూ రూమర్ గా వినపడ్డ ఈ విషయం నిజమే అని క్లారిటీ వచ్చింది.
What is Chiranjeevi connection with Sundeep Kishan Majaka? in telugu
సందీప్ కిషన్ మాట్లాడుతూ...‘‘ ‘మజాకా’ షూట్ సమయంలో ఓసారి అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవిని కలిశాను. మా మధ్య మంచి అనుబంధం ఉంది. ‘మజాకా’ కథ చేస్తున్నందుకు నన్ను మెచ్చుకున్నారు. ఈ కథ తనకెంతో నచ్చిందని.. తాను చేయలేకపోయినందుకు బాధపడ్డానని తెలిపారు .
ఆ మాట నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నేను ఆ విధమైన ప్రశంసలనే అందరి నుంచి కోరుకుంటున్నా’’ అని చెప్పారు. అయితే ఈ మజాకా చిత్రంలో రెండు కీలకమైన పాత్రలు. ఒకటి రావు రమేష్ ది, రెండోది సందీప్ కిషన్ ది. సందీప్ కిషన్ పాత్ర చేసే వయస్సు కాదు కాబట్టి రావు రమేష్ చెయ్యాల్సిన పాత్ర చేయాల్సింది. అలాగే అప్పుడు దర్శకుడు నక్కిన త్రినాధరావు కాదు. రచయిత మాత్రం బెజవాడ ప్రసన్నకుమార్.
What is Chiranjeevi connection with Sundeep Kishan Majaka? in telugu
అలాగే చిరంజీవితో ఈ కథ చేద్దామనుకున్నప్పుడు దర్శకుడు సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ. చిరు తనయ సుస్మిత నిర్మాణంలో ఆ సినిమా వుంటుందని ప్రకటించారు.
అప్పుడు సందీప్ కిషన్ ప్లేస్ లో సిద్దు జొన్నలగడ్డ ఉండబోతున్నారని ప్రచారం జరిగింది. అలాగే త్రిష , చిరంజీవికు జోడి అనుకున్నారు. అన్ని సెట్ అయ్యి చాలా కాలం డిస్కషన్స్ జరిగి లాస్ట్ మినిట్ లో చిరంజీవి తను ఆ పాత్రకు సరిపోనని తప్పుకున్నారని చెప్పుకున్నారు. తర్వాత ఏం జరిగిందో గానీ ఈ సినిమా గురించి మరో అప్డేట్ ఇవ్వలేదు.