MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • మణిరత్నం ‘దళపతి’రీ రిలీజ్ డేట్

మణిరత్నం ‘దళపతి’రీ రిలీజ్ డేట్

రజనీఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్తే. ఈ తరం వాళ్లు కూడా ఈ మ్యాజిక్ ని మరోసారి చూసి ఎంజాయ్ చేయటానికి వీలు ఉంటుంది. 

2 Min read
Author : Surya Prakash
Published : Nov 16 2024, 09:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Thalapathi 4k remastered print to be re released in kerala after jailer success rajinikanth mammootty mohanlal nsn

Thalapathi 4k remastered print to be re released in kerala after jailer success rajinikanth mammootty mohanlal nsn


మ‌మ్ముట్టి, ర‌జ‌నీకాంత్ హీరోలుగా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ద‌ళ‌ప‌తి క‌ల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది.  అంతేకాదు భాక్సాఫీస్ దగ్గర కూడా  ‘దళపతి’ (1991) బ్లాక్‌బస్టర్‌.  ఈ సినిమాలో రజనీతో పాటు మమ్ముట్టి, అరవింద్‌ స్వామి ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు .

ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట మారు మ్రోగుతూనే ఉంటాయి. ఈ సినిమాలో విజువల్స్ గురించి జనం మాట్లాడుకుంటూనే ఉంటారు.   ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కు సిద్దమవుతోంది. మహాభారతం ఆధారంగా చేసుకొని ఈ మూవీ కథని మణిరత్నం తెరకెక్కించారు. 

25


దళపతి సినిమాను రజనీకాంత్ పుట్టిన రోజు సందర్బంగా డిసెంబర్ 12 రీరిలిజ్ చేయాటనికి సన్నాహాలు చేస్తున్నారు. రజనీఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్తే. ఈ తరం వాళ్లు కూడా ఈ మ్యాజిక్ ని మరోసారి చూసి ఎంజాయ్ చేయటానికి వీలు ఉంటుంది.

దళపతి సినిమా గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో జనం చర్చిస్తూనే ఉంటారు. వాళ్లంతా ఈ సినిమా రీరిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగు వెర్షన్ రీరిలీజ్ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి తమిళ వెర్షన్ రీరీలిజ్ అయితే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

35
Thalapathi Movie

Thalapathi Movie

దళపతి చిత్రం తర్వాత రజనీకాంత్‌–మణిరత్నం మరో సినిమా చేయలేదు.  దళపతి సినిమా తర్వాత హీరో రజనీకాంత్‌, దర్శకుడు మణిరత్నం మధ్య కొన్ని సార్లు సినిమా గురించి చర్చలు జరిగాయట. కానీ అవి కార్యరూపం దాల్చలేదు.

ఎట్టకేలకు దర్శకుడు మణిరత్నం తో రజనీకాంత్‌ సినిమాను చేసేందుకు సిద్ధం అయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు 33 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌తో సినిమా చేయాలని మణిరత్నం ఓ కథ రెడీ చేశారని, మణిరత్నంతో సినిమా చేసేందుకు రజనీ కూడా ఆసక్తి చూపిస్తున్నారని టాక్‌. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. స

45
Thalapathi

Thalapathi


రెండు మూడు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా సినిమాలను రూపొందించి, అన్ని భాషల్లో ప్రేక్షకుల అభిమానం, ఆదరణ సొంతం చేసుకున్న దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం కమల్‌ హాసన్‌ తో థగ్‌ లైఫ్ సినిమాను చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో 1987 సంవత్సరంలో 'నాయకన్‌' సినిమా వచ్చింది.

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మళ్లీ వీరి కాంబో రిపీట్ అవ్వలేదు. మూడు దశాబ్దాలుగా వీరి ఫ్యాన్స్ మరో నాయకన్ వంటి సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నామని కోరుతూనే ఉన్నారు. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ సెట్‌ అయింది. థగ్‌ లైఫ్ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మణిరత్నం థగ్ లైఫ్ తర్వాత ఈ కాంబోనే తెరకెక్కనుందని అంటున్నారు.  మరి మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్‌ – మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా సెట్‌ అవుతుందా? వేచి చూడాల్సిందే.  

55


దర్శకుడు మణిరత్నం గత చిత్రం పొన్నియన్ సెల్వన్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు భాగాలుగా విడుదల అయిన ఆ సినిమా కోసం మణిరత్నం చాలా కష్టపడ్డారు. సుదీర్ఘ కాలంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ అంటూ చెబుతూ వచ్చిన మణిరత్నం సక్సెస్ ఫుల్‌ గా తన డ్రీమ్‌ ను పూర్తి చేయడం జరిగింది.

అందుకే ఇకపై చాలా స్పీడ్ గా సినిమాలు చేసి, ప్రేక్షకులు తన నుంచి కోరుకుంటున్న విభిన్న చిత్రాలను, మంచి సినిమాలను ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఒక వైపు కమల్‌ హాసన్ తో థగ్‌ లైఫ్ సినిమాను చేస్తూనే మరో వైపు వేరే  సినిమాకు చర్చలు చేస్తున్నారు.   

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved