- Home
- Entertainment
- Entertainment News
- Chiranjeevi: చిరు, అనిల్ రావిపూడి సినిమాకు ఆ టైటిల్? గమ్మత్తుగా ఉందే
Chiranjeevi: చిరు, అనిల్ రావిపూడి సినిమాకు ఆ టైటిల్? గమ్మత్తుగా ఉందే
Chiranjeevi: చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కలయికలో రాబోయే చిత్రానికి రాఘవేంద్రరావు ఓ టైటిల్ సూచించారు. ఈ సినిమా సంక్రాంతి సీజన్‌లో విడుదల కానుందని మరియు హాస్య ప్రధానంగా ఉంటుందని చిరంజీవి తెలిపారు.

Raghavendra Rao suggests a title for Anil Ravipudi-Chiranjeevi next in telugu
అనిల్ రావిపూడి తన నెక్ట్స్ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. స్వయంగా చిరంజీవి ఆ ప్రకటన చేశారు. ఈ వేసవిలో అనిల్ రావిపూడితో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ సినిమా పూర్తిగా హాస్యం ప్రధానంగా ఉంటుందని చిరంజీవి తెలిపారు.
సినిమా చూసినంతసేపు కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు ఉంటాయన్నారు. కధ చెప్పినప్పుడు నవ్వకుండా ఉండలేకపోయానన్నారు. తనకు కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమాలో నటించాలా అనే ఆసక్తి ఎక్కువగా ఉందన్నారు. అనిల్ రావిపూడితో సినిమాను స్వయంగా చిరంజీవి ప్రకటించడంతో మెగా అభిమానులు ఖుష్ అవుతున్నారు. ఈ నేపద్యంలో ఈ కాంబినేషన్ ఏం టైటిల్ పెడతారనే ఆసక్తి మొదలైంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఓ టైటిల్ ని ఈ కాంబోకి సజెక్ట్ చేస్తూ స్టేజిపై చెప్పారు.
Raghavendra Rao suggests a title for Anil Ravipudi-Chiranjeevi next in telugu
వెంకటేశ్ (Venkatesh) హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హై సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర టీమ్ ‘విక్టరీ వేడుక’ నిర్వహించింది.
దర్శకులు రాఘవేంద్రరావు, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ‘సంక్రాంతి అల్లుడు’!అనే టైటిల్ పెడితే బాగుంటుందని రాఘవేంద్రరావు స్టేజిపై అన్నారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
Raghavendra Rao suggests a title for Anil Ravipudi-Chiranjeevi next in telugu
రాఘవేంద్రరావు మాట్లాడుతూ...‘‘సంక్రాంతి సీజన్‌ను వదిలిపెట్టొద్దని అనిల్‌కు చెబుతున్నా. చిరంజీవితో అనిల్ రూపొందించబోయే సినిమా పేరు ‘సంక్రాంతి అల్లుడు’ అయితే బాగుంటుంది. మీ సినిమా ఇండస్ట్రీకి ‘సంక్రాంతి’ తెచ్చింది. ఎక్కువ థియేటర్లలో ఎక్కువ షోలు సినిమా ప్రదర్శితమవడం చాలా రోజుల తర్వాత చూస్తున్నా.
ఈ చిత్రంలోని హీరోయిన్ల (ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి) నటన అద్భుతం. వెంకటేశ్ బయట సైలెంట్‌గా ఉన్నా.. ఇద్దరు హీరోయిన్స్ తో తెరపై సందడి చేస్తాడు. భీమ్స్ సంగీతం సినిమాకి మరో హైలెట్. మీ కాంబినేషన్ (అనిల్- భీమ్స్)లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా. చిరంజీవి హీరోగా తాను తెరకెక్కించబోయే సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్‌వని అనిల్ చెప్పాడు. ’’ అని రాఘవేంద్రరావు అన్నారు.