- Home
- Entertainment
- Entertainment News
- KGF2:ప్రశాంత్ నీల్ రెమ్యునరేష్ వింటే మన స్టార్ డైరక్టర్స్ కు కళ్లు తిరుగుతాయి
KGF2:ప్రశాంత్ నీల్ రెమ్యునరేష్ వింటే మన స్టార్ డైరక్టర్స్ కు కళ్లు తిరుగుతాయి
బాక్సాఫీస్ వద్ద కేజీ ఎఫ్ 2 హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అంతే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

దేశవ్యాప్తంగా కేజీఎఫ్ మేనియా కుమ్మేస్తున్న సంగతి తెలిసిందే. కలెక్క్షన్లో పాత రికార్డులన్నంటినీ రాఖీ భాయ్ తుడిచిపెట్టేస్తున్నాడు. అలాగే ఈ సినిమాతో హీరోగా యష్ కు ఎంతపేరొచ్చిందో అంతకు మించి .. డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు సినీవర్గాల్లో ఎక్కడ ఎవరినోట విన్నా ప్రశాంత్ నీల్ పేరే వినిపిస్తోంది. ప్రతీ ఒక్కరు ప్రశాంత్ నీల్ గురించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఆయన రెమ్యునరేషన్ ఎంత అనేది తెలుసుకుని షాక్ అవుతున్నారు. మన తెలుగు డైరక్టర్స్ లో రాజమౌళి ఒక్కరే ఆ స్దాయి రెమ్యునరేషన్ తీసుకోవటం చెప్పుకుంటున్నాము. ఇంతకీ ప్రశాంత్ నీల్ తీసుకునేది ఎంత?
వాస్తవానికి డైరక్టర్ గా ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు మూడు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. మొదటిది ఉగ్రం కాగా, రెండు ‘కెజిఎఫ్’, 'కేజీఎఫ్ చాప్టర్ 2' . ముఖ్యంగా కేజీఎఫ్ మెగా సక్సెస్ తర్వాత కన్నడ దర్శకుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. సినిమా విడుదలకు ముందే తెలుగు నిర్మాతల కోసం రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ చేశాడు.ఈ నేపధ్యంలో ప్రశాంత్ నీల్ రెమ్యునరనేషన్ ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ప్రశాంత్ నీల్ సరికొత్త సంచలనంగా మారాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటూ ....ప్రొడక్షన్ లో ఉన్న ప్రభాస్ నటించిన ‘సాలార్’ చిత్రానికి రూ.25 కోట్లు చెల్లించారు. ‘కేజీఎఫ్’కి చెందిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాబట్టి, ప్రశాంత్ నీల్ కూడా లాభాల్లో వాటా పొందుతాడు. అంటే ఆ మొత్తం కూడా చాలా పెద్దదే అని చెప్పాలి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంక్రోల్ చేయడానికి నీల్ #NTR31 కోసం అడ్వాన్స్ మొత్తాన్ని కూడా తీసుకున్నాడు. నిర్మాత డివివి దానయ్య కోసం మరో తెలుగు సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. అడ్వాన్స్ ఎంత అనేది తెలియరాలేదు కానీ భారీగానే ఉంటుందని చెప్పుకోవాలి.
అసలు అప్పటివరకూ ప్రాచుర్యంలోనే లేని శాండిల్‌వుడ్ (కన్నడ సినీ పరిశ్రమ)నే కాకుండా యావత్తు దేశ సినీ ఖ్యాతిని దర్శకుడు ప్రశాంత్ నీల్ హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు. ఇంతటి ఖ్యాతి గడించిన ఈ ప్రశాంత్ నీల్ కు ఎంత ఇచ్చినా తక్కువే అంటారు.
Prashanth Neel
అయితే, కేజీఎఫ్ 2 పాన్-ఇండియా విజయం తర్వాత, అతను మరింత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ మరియు దానయ్య తమ సినిమాల కోసం దాదాపు రూ.50 కోట్లు ఇస్తున్నారని సమాచారం.
Prashanth Neel
ఇక ‘కేజీఎఫ్ 2’ లాభాల్లో ప్రశాంత్ నీల్‌కు భారీ వాటా దక్కింది. యష్ లాంటి స్టార్‌తో రూ. 1000 కోట్ల (గ్రాస్) సినిమాను డెలివరీ చేసినందున ప్రశాంత్ నీల్ ఇంత మొత్తం రెమ్యునరేషన్ కు అర్హుడనటంలో సందేహం లేదు.
Salaar- Director Prashanth Neel Ends All Speculation As He Clarifies The Prabhas Satarrer Is A Fresh Story
ప్రశాంత్ నీల్‌ది మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం స్వగ్రామం. మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్, భారతి దంపతుల కుమారుడు. అయితే వీరి కుటుంబం బెంగళూరులోనే స్థిరపడింది. కొన్నేళ్ల క్రితం మృతి చెందిన తన తండ్రి సుభాష్ మృతదేహాన్ని నీలకంఠాపురంలోనే ఖననం చేయడంతో ప్రశాంత్‌నీల్ అప్పుడప్పుడూ కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి వెళుతుంటారు.
KGF 2
ప్రశాంత్ విద్యాభ్యాసం బెంగళూరులో సాగింది. వారి కుటుంబానికి బెంగళూరులో హాయ్‌ల్యాండ్ ఉండేది. అక్కడ ఎక్కువగా సినీ షూటింగ్‌లు జరిగేవి. దీంతో ప్రశాంత్ తరచూ అక్కడికి వెళ్లి సినీ చిత్రీకరణ చూసేవారు. ఈ క్రమంలోనే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు.
డిగ్రీ తర్వాత ఎంబీఏ కోర్సులో జాయిన్ అయిన ప్రశాంత్ నీల్ సినిమాలపై మక్కువతో ఫిల్మ్ స్కూల్లో చేరి అన్ని విభాగాలపై అవగాహన పెంచుకున్నాడు. 2014లో ‘ఉగ్రమ్’ సినిమాతో ప్రశాంత్ నీల్ చిత్ర దర్శకుడిగా తన సత్తా చాటారు. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
‘ఉగ్రమ్’ సినీ చిత్రీకరణకు కోలార్ గోల్డ్ ఫీల్డ్‌కు వెళ్లిన ప్రశాంత్ నీల్.. అక్కడి పరిస్థితులు చూసి ఓ లైన్ రాసుకుని కోలార్ బంగారు గనుల ఇతివృత్తం ఆధారంగా 2018లో కేజీఎఫ్–1 సినిమా తీశారు. 2022లో కేజీఎఫ్–2 సినిమా తెరకెక్కించారు.
ಅದಕ್ಕೂ ಕಾರಣವಿದೆ. ಕೆಜಿಎಫ್ ಚಾಪ್ಟರ್ 1 ಸೂಪರ್ಹಿಟ್ ಆದಾಗಿನಿಂದಲೂ ಪ್ರಶಾಂತ್ ನೀಲ್ ಕೆಜಿಎಫ್ ಚಾಪ್ಟರ್ 2 ಮುಗಿದ ಮೇಲೆ ಮಹೇಶ್ ಬಾಬು, ಜೂ.ಎನ್ಟಿಆರ್ ಸಿನಿಮಾ ನಿರ್ದೇಶನ ಮಾಡುತ್ತಾರೆ ಎನ್ನುವ ಮಾತು ಕೇಳುತ್ತಲೇ ಇತ್ತು.
తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మళయాలం భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్–2 అందరి అంచనాలను అధిగమించి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఒక్కసారిగా చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఎవరు? ఎక్కడి వాడు? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఆరా తీయడం మొదలైంది.
త్వరలోనే ప్రభాస్ హీరోగా మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సలార్’ను ఆయన తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో కేజీఎఫ్ 2లో నటించిన ఆర్టిస్ట్ లకు ఎంతమేర పారితోషికం ముట్టజెప్పారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం రాఖీభాయ్ యశ్ ఈ సినిమాకు రూ.25 - 30 కోట్ల మేర పారితోషికం తీసుకున్నాడట. అధీరాగా నటించిన సంజయ్ దత్ రూ.10 కోట్లు, రవీనా టండన్ రూ.2 కోట్లు, శ్రీనిధి శెట్టి రూ.3-4 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ.80-85 లక్షల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కళాఖండాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ రూ.15-20 కోట్ల దాకా అందుకున్నాడని సమాచారం.