#Khaidi2: డిల్లీతో రోలెక్స్ మాత్రమే తో పాటు విక్రమ్ కూడా
#Khaidi2: కమల్ హాసన్, కార్తీ, సూర్య కలిసి ఖైదీ 2లో నటిస్తున్నారా? లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాలో విక్రమ్ నుండి రోలెక్స్ పాత్రలో సూర్య, ఖైదీ నుండి డిల్లీగా కార్తీ కనిపించనున్నారు. షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి!

Kamal Haasan and Karthi To Act Together For Khaidi Movie Sequel
ఇప్పుడు అంతా కాంబినేషన్స్ నడుస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు కలిసి సినిమాలో చేస్తే ఆ ప్రాజెక్టుకు ఓ రేంజిలో క్రేజ్ వస్తోంది. ఈ విషయం గమనించిన దర్శకులు, నిర్మాతలు ఆ దిశగా ఆలోచించి కథలు రెడీ చేసి కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు.
అలాగే ఇప్పుడు కమల్ హాసన్ ని తమ ఖైధీ 2 ప్రాజెక్టులోకి తీసుకువస్తున్నరని వినిపిస్తోంది. ఇప్పటికే అన్నదమ్ములైన సూర్య, కార్తీలు ఇద్దరూ ‘ఖైదీ 2’ సినిమాలో తెరని పంచుకోనున్నారు. తాజాగా కమల్ హాసన్ ని కూడా సీన్ లోకి తెస్తున్నారని తమిళ సినీ వర్గాల సమాచారం.
కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఖైదీ’.లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి మూవీగా వచ్చిన ‘ఖైదీ’ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో 2019 అక్టోబరు 25న విడుదలై పెద్ద హిట్‌గా నిలిచింది.
ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని కార్తీ, లోకేష్ కనగరాజ్ అనేక సార్లు స్పష్టం చేశారు. త్వరలో అది నిజం కాబోతోంది. అయితే ఈ సినిమాలో హీరో సూర్య కీలక పాత్రలో నటించనున్నారు. కమల్ హాసన్ ని మరో కీలకమైన పాత్రలో చూపించబోతున్నారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా వచ్చిన ‘విక్రమ్’ చిత్రంలో రోలెక్స్ అనే డాన్ గా అతిథి పాత్రలో మెరిశారు సూర్య. ‘ఖైదీ 2’ లోనూ రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తారని టాక్. పైగా ‘ఖైదీ 2’లో రోలెక్స్‌ను డిల్లీ (’ఖైదీ’ చిత్రంలో కార్తీ చేసిన పాత్ర పేరు డిల్లీ) నేరుగా కలవాల్సి ఉందని ఇటీవల కార్తీ చెప్పడంతో వీరిద్దరూ కలిసి నటించడం పక్కా అని తేలిపోయింది.
తమ్ముడు కార్తీతో కలిసి ‘ఖైదీ– 2’లో తాను నటిస్తానని సూర్య కూడా ఇటీవల ఓ సందర్భంలో చెప్పడంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఇప్పుడు కమల్ కూడా కలవటంతో పండగ వాతావరణం కనిపిస్తోంది. ‘ఖైదీ 2’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మొదలుకానుంది.