NTRNeel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రంకు షాకింగ్ బడ్జెట్
NTRNeel: జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఎన్టీఆర్ నీల్' చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం, ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ చిత్రం కానుంది.
- FB
- TW
- Linkdin
Follow Us

Jr NTR and Prashanth Neel join hands for a high budget action spectacle in telugu
NTRNeel: జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లో అతిపెద్ద చిత్రంగా చేస్తున్నారు. ఇందుకోసం ఆయన భారీ స్థాయి యాక్షన్ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో జతకట్టాడు. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్ తో రెడీ అవుతున్న ఈ పాన్ ఇండియా ని ప్రతిష్టాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లోప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించి, లొకేషన్‌లోని ఓ ఫొటోని షేర్ చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎంత బడ్జెట్ లో రూపొందుతోందనే విషయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.
Jr NTR and Prashanth Neel join hands for a high budget action spectacle in telugu
ఆర్‌ఆర్‌ఆర్, దేవర వరుస సక్సెస్ తర్వాత హీరో ఎన్టీఆర్ సినిమా పై ఏ రేంజి క్రేజ్ ఉంటుంతో తెలిసిందే. దానికి తోడు ‘కేజీఎఫ్, సలార్’ వంటి విజయాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఇది.
250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన దేవర తర్వాత, చేస్తున్న ఈ చిత్రంపై ఇప్పుడు రూ.360 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీలోనూ ఎన్టీఆర్ మార్కెట్ విస్తరించబోతోంది. దాంతో ఈ బడ్జెట్ రికవరీలపై ఎవరికీ ఏ సందేహాలు లేవు. ఎన్టీఆర్ ఇప్పటివరకు పనిచేసిన అత్యధిక బడ్జెట్ ఇదే కావటం విశేషం.
Jr NTR and Prashanth Neel join hands for a high budget action spectacle in telugu
‘‘మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న స్టార్స్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్ నీల్’ పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణతో షూటింగ్ ఆరంభించాం. తర్వాతి షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొంటారు.
ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించనున్నారు ప్రశాంత్ నీల్. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించనున్నాం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న మా సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: భువన్ గౌడ, సంగీతం: రవి బస్రూర్.