Allu Arjun: అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్టు క్రేజీ అప్‌డేట్
Allu Arjun: అల్లు అర్జున్ ,అట్లీ చిత్రం ప్రాజెక్టు చాలా కాలంగా నలుగుతోంది. అయితే పుష్ప 2 అయ్యేదాకా ఏ ప్రాజెక్టు ఫైనల్ చేయకూడదని వెయిట్ చేసారు. ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు.

Allu Arjun And Atlee Will Work Together On His Upcoming Movie in telugu
పుష్ప 2 సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఇప్పుడు చాలా మంది స్టార్ డైరక్టర్స్ ని అల్లు అర్జున్ చుట్టూ తిరిగేలా చేస్తోంది. ఈ క్రమంలో అనేక తమిళ దర్శకులతో అల్లు అర్జున్ సినిమాను సిట్టింగ్స్ చేశాడు. కానీ అనుకోని కారణాల వల్ల అందులో ఏ సినిమా కూడా వర్కవుట్ అవ్వలేకపోయింది. అల్లు అర్జున్ మాత్రం తనకు నచ్చే డైరక్టర్స్, తనకు కంఫర్ట్ ఉండే దర్శకులతోనే ముందుకు వెళ్తున్నారు.
ఇప్పుడు అల్లు అర్జున్ ..తనకు సూపర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో ముందుకు వెళ్తున్నారు. అలాగే తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేయనున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని నెలలుగా ఈ గాసిప్ట్స్ లాంటి వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నా.. ఫైనల్‌గా ఈ రూమర్స్ నిజమే అని సమాచారం తెలుస్తోంది. ఇంతకీ ఈ ప్రాజెక్టు ఎంతదాకా వచ్చిందో చూద్దాం.
Allu Arjun And Atlee Will Work Together On His Upcoming Movie in telugu
అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అల్లు అర్జున్, అట్లీ కలిసి పనిచేస్తారని వార్తలు మొదలయ్యాయి. సాధారణంగా పెద్ద హిట్ కొట్టిన దర్శకులకు అల్లు అర్జున్ వంటి స్టార్స్ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తారు. ఓ రకంగా నా కోసం మీరు కథ చేసుకోవచ్చు అనే సిగ్నల్ అందులో ఉంటుంది. ఇది అందరు పెద్ద హీరోలు చేసే పనే. టాలెంట్ ని ప్రక్కకు వెళ్లకుండా వెంటనే తామే పట్టుకోవాలని చేస్తూంటారు.
అలా అట్లీతో అల్లు అర్జున్ ..సినిమా కు సంభందించిన ప్రాజెక్టు ఇనీషియట్ అయ్యింది. అయితే ఆ తర్వాత అట్లీ రెండు మూడు స్టోరీ లైన్స్ చెప్పినా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరో ప్రక్క అట్లీ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసారని ప్రక్కన పెట్టేరనే వార్తలు వచ్చాయి. అయితే అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 రిజల్ట్ చూసాక ప్లాన్ చేద్దామని వాయిదా వేస్తూ వచ్చారట. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
Allu Arjun And Atlee Will Work Together On His Upcoming Movie in telugu
ప్రస్తుతం అట్లీ తన దృష్టి మొత్తం సల్మాన్ ఖాన్ సినిమాపై పెట్టారు. అలాగే రీసెంట్ గా అల్లు అర్జున్ ని అట్లీ, ఆయన టీమ్ వచ్చి హైదరాబాద్ లో కలిసారట. ఈ క్రమంలో ప్రాజెక్టు ఫైనలైజ్ చేసారని, త్వరలోనే అందుకు సంభందించిన స్క్రిప్టు పనులు మొదలుకానున్నాయని , అందుకోసం అట్లీ టీమ్ పనిచేస్తుందని వినికిడి. అలాగే అల్లు అర్జున్ ఈ లోగా త్రివిక్రమ్ తో సినిమా పూర్తి చేసుకుని వస్తారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించనున్నారు. అట్లీ మార్క్ స్టైలిష్ యాక్షన్ అంశాలతో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం. ఈ పాన్ ఇండియన్ మూవీ కోసం అట్లీ 60 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలిసింది. జవాన్ బ్లాక్‌బస్టర్ తర్వాత అట్లీకి డిమాండ్ పెరగడంతో అతడు కోరినంత మొత్తాన్ని ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా దీనికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ వ్యవహరిస్తాడని తెలుస్తోంది.