- Home
- Sports
- Cricket
- Chahal-Mahvash : అలీగఢ్ అమ్మాయితో చాహల్ చెట్టాపట్టాలు ... ఈ మహ్వశ్ బ్యాగ్రౌండ్ తెలుసా?
Chahal-Mahvash : అలీగఢ్ అమ్మాయితో చాహల్ చెట్టాపట్టాలు ... ఈ మహ్వశ్ బ్యాగ్రౌండ్ తెలుసా?
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తో దుబాయ్ స్టేడియంలో కనిపించిన యువతి అలీగఢ్ అమ్మాయి మహ్వశ్. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

Chahal Mahvash
Chahal-Mahavash : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఇండియా-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయమది. ఇరుజట్లు గెలుపుకోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి... విజయం ఎవరిని వరిస్తుంది, ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు అందుకుంటారన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. ఇలాంటి సమయంలో కెమెరా కన్ను అభిమానులతో కలిసి మ్యాచ్ ను ఆస్వాదిస్తున్న టీమిండియా క్రికెటర్ యజేంద్ర చాహల్ ను చూపించింది. అయితే అందరి చూపు చాహల్ పక్కనున్న అమ్మాయిపై పడింది.
ఇప్పటికే చాహల్, ధనశ్రీ దంపతులు విడాకులు తీసుకున్నారు. మరి దుబాయ్ స్టేడియంలో చాహల్ తో కనిపించిన యువతి ఎవరు? ధనశ్రీకి దూరమైన తర్వాత ఓ అమ్మాయితో చాహల్ ప్రేమాయణం కొనసాగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది... ఆమె ఈమేనా? ఇలాంటి అనేక ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతున్నాయి. కాబట్టి చాహల్ తో కనిపించిన మిస్టరీ గర్ల్ గురించి తెలుసుకుందాం.
Yuzvendra Chahal
మహ్వశ్ ప్రియురాలా? స్నేహితురాలా?: చాహల్ క్లారిటీ ఇచ్చేసాడుగా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు యజ్వేంద్ర చాహల్ ఓ అభిమానిలా వెళ్లారు. ఆయన ఒక్కరే వెళితే అది ఇంతపెద్ద న్యూస్ అయ్యేది కాదు... ఓ యువతితో కలిసి వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆమె ఎవరో కాదు రేడియో జాకీ మహ్వశ్.
చాహల్-ధనశ్రీ దంపతుల విడాకుల ప్రచారం జరుగుతున్న సమయంలోనే మహ్వశ్ పేరు వినిపించింది. ఈమెతో చాహల్ డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వెలువడ్డాయి... దీనికి బలాన్నిస్తూ అతడితో కలిసున్న ఫోటోను మహ్వశ్ సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని క్లారిటీకి వచ్చారు. కానీ చాహల్, మహ్వశ్ ఇద్దరూ తాము మంచి స్నేహితులమని చెప్పుకుంటూ వచ్చారు.
ఇక తాజాగా మహ్వాశ్ తో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతున్న దుబాయ్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు చాహల్. ఆయనకు తెలుసు మ్యాచ్ జరిగే సమయంలో కెమెరా కన్ను తనపై పడుతుందని... అయినా ఆమెతో కలిసి వచ్చారంటేనే తమ విషయాన్ని ప్రపంచానికి తెలియాలని చాహల్ భావించారన్నమాట. ఇలా స్వయంగా చాహలే మహ్వశ్ తో తన బంధం గురించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసారు... ఇక ప్రత్యక్షంగా ప్రకటించడమే మిగిలింది.
Mahvash
ఎవరీ మహ్వశ్?
టీమిండియా క్రికెటర్ చాహల్ తో కనిపించిన మిస్టరీ గర్ల్ మహ్వశ్ ది ఉత్తర ప్రదేశ్. అలీగఢ్ లో పుట్టిపెరిగిన ఈమె దేశ రాజధాని డిల్లీలో ఉన్నత విద్యాభ్యాసం చేసారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ చేసిన మహ్వశ్ సినీ రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు.
అయితే సినిమాల్లోకి వెళ్ళాలంటే ముందుగా మంచి గుర్తింపు పొందాలని భావించిన ఆమె యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు చేసింది. ఆమె మహిళా సాధికారతతో పాటు అమ్మాయిల భద్రతకు సంబంధించిన అనేక ఫ్రాంక్ వీడియోలు చేసారు. ఇలా దేశంలో మొదటి మహిళా ప్రాంక్స్టర్ గా గుర్తింపు పొందారు.
ఇక మహ్వశ్ రేడియో జాకీగా కూడా పనిచేసారు. ఇలా కూడా మహ్వశ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె లక్షలాదిమంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఇలా సోషల్ మీడియా ఇన్ప్లుయెంజర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా వచ్చాయట.
స్వయంగా మహ్వశే సోషల్ మీడియాలో తాను ఫిల్మ్ ప్రొడ్యూసర్, యాక్టర్ గా పేర్కొంది. అయితే ఇప్పటివరకు ఆమె ఏ సినిమాలో నటించింది లేదు... కాబట్టి ఇప్పుడిప్పుడే ఆమెకు సినిమా అవకాశాలు వచ్చివుంటాయి. కానీ సినిమాలకంటే ముందే చాహల్ తో కనిపించి పెద్దపెద్ద హీరోయిన్లకు కూడా లేని ఫేమ్ మహ్వశ్ సంపాదించారు.