- Home
- Sports
- Cricket
- పృథ్వీ షాని పక్కనబెట్టి, టెస్టులు ఆడే శుబ్‌మన్ గిల్‌పై ఇంత ప్రేమ ఎందుకో! టీమిండియాపై...
పృథ్వీ షాని పక్కనబెట్టి, టెస్టులు ఆడే శుబ్‌మన్ గిల్‌పై ఇంత ప్రేమ ఎందుకో! టీమిండియాపై...
పృథ్వీ షా, ఓ ప్యాకెట్ డైనమేట్‌లా టీమిండియాలోకి వచ్చిన సెన్సేషనల్ బ్యాటర్. వీరూలా ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడే పృథ్వీ షా, ఆడిలైడ్ టెస్టు తర్వాత టీమిండియాలో అవకాశాలు దక్కించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. మరోవైపు పృథ్వీ షా కెప్టెన్సీలో అండర్19 వరల్డ్ కప్ ఆడిన శుబ్‌మన్ గిల్ మాత్రం టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్ అయిపోయాడు...

Image credit: PTI
2020 ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు ఆరంగ్రేటం చేసిన శుబ్‌మన్ గిల్, మంచి పర్ఫామెన్స్‌తో మెప్పించాడు. వన్డేల్లో రికార్డు లెవెల్ పర్ఫామెన్స్‌తో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 6లోకి ఎంట్రీ ఇచ్చేశాడు...
Image credit: PTI
టీమిండియా తరుపున ఇప్పటిదాకా 21 వన్డేలు ఆడిన శుబ్‌మన్ గిల్, 73.76 సగటుతో 1254 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగా అతనికి టీ20ల్లో అవకాశం ఇచ్చింది టీమిండియా. ఐపీఎల్ 2022 సీజన్‌లో గిల్ ఆడిన ఇన్నింగ్స్‌లు కూడా అతనికి టీ20ల్లో అవకాశం రావడానికి కారణం కావచ్చు..
Image credit: PTI
ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో అంతర్జాతీయ టీ20 ఆరంగ్రేటం చేసిన శుబ్‌మన్ గిల్, ఇప్పటిదాకా 4 మ్యాచుల్లో చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ‘వన్డేల్లో బాగా ఆడినంత మాత్రాన శుబ్‌మన్ గిల్‌ని టీ20ల్లో ఆడించడం కరెక్ట్ కాదు. అతను టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్ కాదు...’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
Image credit: PTI
న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి పృథ్వీ షాని కూడా ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే షాని పక్కనబెట్టి, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లతో ఓపెనింగ్ చేయించాడు హార్ధిక్ పాండ్యా. ఈ ఇద్దరూ స్వల్ప స్కోర్లకే అవుట్ కావడంతో టీమిండియా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి, లక్ష్యఛేదనలో తడబడింది..
పృథ్వీ షా టీ20 స్ట్రైయిక్ రేటు 151.76గా ఉంది. అదే సమయంలో శుబ్‌మన్ గిల్ స్ట్రైయిక్ రేటు 128.75 మాత్రమే. టీ20ల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్నప్పటికీ స్ట్రైయిక్ రేటు తక్కువగా ఉందనే కారణంగా శిఖర్ ధావన్‌ని టీమ్ నుంచి తప్పించింది టీమిండియా...
శిఖర్ ధావన్‌ని తప్పించడానికి కారణమైన స్ట్రైయిక్ రేటు, శుబ్‌మన్ గిల్‌ని టీ20 టీమ్‌లోకి ఎలా తీసుకొచ్చిందని నిలదీస్తున్నారు అభిమానులు. శుబ్‌మన్ గిల్‌పై బీసీసీఐకి, సెలక్టర్లకు ఎందుకు ఇంత మమకారం ఉందో అర్థం కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...
Shubman Gill-Prithvi Shaw
రంజీల్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌ని పట్టించుకోని సెలక్టర్లు, శుబ్‌మన్ గిల్ లాంటి ఒకరిద్దరు ప్లేయర్లను మాత్రం జట్టులో ఉంచాలని పట్టుబట్టడం వెనక ఏదో సిఫారసులాంటిది ఉండవచ్చని అనుమానిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్...