MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మేం ఆడినప్పుడు వందల్లో.. ఇప్పుడు కోట్లల్లో : ఐపీఎల్ పై గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మేం ఆడినప్పుడు వందల్లో.. ఇప్పుడు కోట్లల్లో : ఐపీఎల్ పై గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sourav Ganguly: టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం బీసీసీఐకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఐపీఎల్  పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడిన కాలానికి ఇప్పటికీ గల కారణాలను వివరించాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Jun 12 2022, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తాను క్రికెట్ ఆడినప్పుడు ఆటగాళ్ల సంపాదన వందలు, వేలల్లోనే ఉండేదని.. కానీ ఇప్పుడు క్రికెటర్లు కోట్లలో సంపాదిస్తున్నారి అంటున్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఐపీఎల్ తో పాటు తన కెప్టెన్సీ ఇతరత్రా విషయాలపై దాదా  స్పందించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇండియా లీడర్షిప్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న గంగూలీ మాట్లాడుతూ.. ‘క్రికెట్ ఎంతగా అభివృద్ధి చెందుతున్నదో నా కళ్లారా చూస్తున్నాను. నాలాంటి క్రికెటర్లు క్రికెట్ ఆడేప్పుడు  వందల్లో సంపాదిస్తే ఇప్పుడు  ఆటగాళ్లు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.  

37

భారత్ లో టీ20  క్రికెట్ లీగ్ అభిమానుల్లోంచి పుట్టింది. దీనిని అభిమానులు, ప్రజలే నడిపిస్తున్నారు. రాబోయే కాలంలో ఇది మరింత వృద్ధి చెందుతుంది.

47

ప్రస్తుతం ఫుట్బాల్ లో  అత్యంత ప్రాముఖ్యత పొందిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) కంటే మన (ఐపీఎల్) కే ఆదాయం ఎక్కువగా వస్తున్నది.  నేను ఎంతగానో ఇష్టపడే ఆట ఇంత అభివృద్ది చెందుతుండటం నాకు సంతోషంగా ఉంది...’ అని చెప్పాడు.

57

2008 లో ప్రారంభమైన ఐపీఎల్.. ఈ స్థాయికి  చేరుకోవడానికి సుదీర్ఘ ప్రయాణం చేసింది. తాజాగా పది ఫ్రాంచైజీలు, 74 లీగ్ మ్యాచ్ లతో ఉన్న ఐపీఎల్.. రాబోయే రోజుల్లో మరింత విస్తృతి చెందనున్నది.   రాబోయే ఐదేండ్ల కాలంలో 2025 సీజన్ నుంచి  ఐపీఎల్ సీజన్ లో 84, 94 మ్యాచలు కూడా జరుగనున్నాయి.  
 

67

అంతేగాక  ఒకే ఏడాదిలో రెండు  ఐపీఎల్ సీజన్లను నిర్వహించాలని కూడా డిమాండ్లు ఊపందుకున్నాయి.  ఇప్పుడు కాకపోయినా  రాబోయే రోజుల్లో అయినా అది జరగక మానదని  క్రికెట్ పండితులు విశ్లేషణ చేస్తున్నారు. 
 

77

కాగా.. ఐపీఎల్ తో పాటు తన కెప్టెన్సీ గురించి కూడా గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు కెప్టెన్సీ అనేది  మైదానంలో ముందుండి నడిపించడం. సారథ్యం అనేది జట్టును బలంగా తీర్చిదిద్దడం.  ఆ క్రమంలో నేను అజారుద్దీన్, సచిన్, ద్రావిడ్ లతో కలిసి పనిచేసినప్పుడు వారితో పోటీ పడలేదు. వాళ్లతో కలిసి బాధ్యతలను పంచుకున్నా..’ అని తెలిపాడు. 

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Breaks Sachin Record: సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ
Recommended image2
Vaibhav Sooryavanshi: సంజూ, అభిషేక్‌లలో ఒకరికి షాక్.. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లోకి వైభవ్ సూర్యవంశీ
Recommended image3
IND vs AFG Test: ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ సెంచరీల వర్షం.. కెప్టెన్ గిల్‌ ఖాతాలో వరల్డ్ రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved