MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నీ విజయాల వెనకున్న కష్టం నాకు మాత్రమే తెలుసు.. విరాట్‌కి తన స్టైల్‌లో విష్ చేసిన అనుష్క, కోహ్లీ కవిత్వం...

నీ విజయాల వెనకున్న కష్టం నాకు మాత్రమే తెలుసు.. విరాట్‌కి తన స్టైల్‌లో విష్ చేసిన అనుష్క, కోహ్లీ కవిత్వం...

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మల నాలుగో వివాహ వార్షికోత్సవం నేడు. నాలుగేళ్లు డేటింగ్ చేసి, ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న విరుష్క జోడీ, వార్షికోత్సవం సందర్భంగా తమ భాగస్వామికి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుకున్నారు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 11 2021, 07:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

‘there is no easy way out, there is no shortcut home... ఇది నీ ఫెవరెట్ సాంగ్, నువ్వు ఎప్పుడూ నమ్మే మాటలు కూడా. బంధాలలోని ప్రతీ నిజాన్ని దాచి పెట్టే మాటలు ఇవే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఎన్నో అంచనాలు, మరెన్నో లెక్కలతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో ఓ ఉన్నతమైన వ్యక్తిని, నీలా నువ్వు బతకడానికి చాలా ధైర్యం ఉండాలి...అది నీలో చూశా...

311

నాకు అవసరమైనప్పుడు నువ్వు నాలో స్ఫూర్తి నింపుతావు. నేను ఏం చెప్పినా, ఓపిగ్గా వినడానికి సిద్ధంగా ఉంటావు. ఇద్దరు సమవుజ్జీల మధ్య పెళ్లి సక్సెస్ కావాలంటే, ఆ ఇద్దరి మధ్య నమ్మకం, భద్రత ఉండాలి...

411

నా వరకూ నువ్వే మోస్ట్ సెక్యూర్ మ్యాన్... కేవలం చాలా కొద్దిమందికి మాత్రమే నువ్వేంటో, నిజమైన నీ తత్వం ఏంటో తెలుసు. నీ విజయాల వెనక ఆత్మ ఏంటో తెలుసు...

511

వందల కోట్ల అంచనాల మధ్య ఆ నిజమైన మనిషి ఎప్పుడూ దాగి ఉంటాడు. నీ ప్రేమ, నమ్మకం, ప్రేమ, గౌరవం మాకు ఎప్పుడూ మార్గదర్శకాలే..

611

మనం ఎప్పుడూ ఇలాగే క్రేజీగా ఉందాం... మనలో నాకు నచ్చింది, నేను మెచ్చింది అదే...’ అంటూ భర్త విరాట్ కోహ్లీకి ఎమోషనల్‌గా వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలిపింది అనుష్క శర్మ...

711

అనుష్క శర్మ, విరాట్‌తో దిగిన క్రేజీ ఫోటోలను పోస్ట్ చేసి విషెస్ చేస్తే, కూతురు వామిక కోహ్లీతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసిన విరాట్ కోహ్లీ, భార్యకు ఓ కవిత ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు...

811

‘నా సిల్లీ జోక్స్‌ను, నా బద్ధకాన్ని నాలుగేళ్లుగా భరిస్తున్నావ్... నేను నన్నుగా అంగీకరిస్తున్నావ్, నేను ఎలా ఉన్నా, దాన్ని ప్రేమిస్తున్నావ్...

911

ఈ నాలుగేళ్లు ఆ దేవుడు మనల్ని ఆనందంగా చూశాడు. ఎంతో నమ్మకమైన, ఎంతో ప్రేమను చూపించే ధైర్యవంతురాలైన మహిళను పెళ్లాడి నాలుగేళ్లు గడిచిపోయింది...

1011

సరైన పనులు చేయడానికి నాకు నువ్వు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉన్నావ్. నిన్ను పెళ్లాడిన వాడిగా నాలుగేళ్లు నాకు నిండాయి. నన్ను ఎప్పుడూ సరిచేసే మార్గానికి నువ్వు...

1111

నువ్వు నా దానివి అయినందుకు ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటా. కుటుంబంగా ఇది మనకి మొట్టమొదటి వివాహ వార్షికోత్సవం. ఈ చిన్ని తల్లితో మన జీవితం పరిపూర్ణమైంది...’ అంటూ రాసుకొచ్చాడు విరాట్ కోహ్లీ...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Recommended image3
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved