- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ మంచి ప్లేయరే కానీ సచిన్ టెండూల్కర్ అంత టాలెంటెడ్ కాదు! వసీం జాఫర్ షాకింగ్ కామెంట్స్..
విరాట్ కోహ్లీ మంచి ప్లేయరే కానీ సచిన్ టెండూల్కర్ అంత టాలెంటెడ్ కాదు! వసీం జాఫర్ షాకింగ్ కామెంట్స్..
సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కెరీర్‌లో నెలకొల్పిన రికార్డుల్లో చాలా వరకూ 16 ఏళ్లలోనే బ్రేక్ చేసేశాడు విరాట్ కోహ్లీ. 76 అంతర్జాతీయ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును అందుకోగలడా? అనేది చర్చనీయాంశంగా మారింది...

సచిన్ టెండూల్కర్‌తో, విరాట్ కోహ్లీతో కలిసి ఆడిన టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్, ఈ ఇద్దరు లెజెండరీ బ్యాటర్లకి మధ్య ఉన్న తేడా గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు..
‘సచిన్ టెండూల్కర్ ఓ ప్రత్యేకమైన ప్లేయర్. టాలెంటెడ్ మాత్రమే కాకుండా చాలా హార్డ్ వర్కింగ్. విరాట్ కోహ్లీ టాలెంటెడ్ ప్లేయర్ అని నేను అనుకోను. 2008లో నేను విరాట్‌ని చూశాను. అండర్19 వరల్డ్ కప్‌లో విరాట్ బ్యాటింగ్‌లో చాలా లోపాలు గమనించాను..
అతను కుర్రాడు, చాలా వైల్డ్. చిన్నతనం నుంచే తనను తాను ఇంకా ఇంకా మెరుగుపర్చుకోవాలనే తపన, తాపత్రయం విరాట్ కోహ్లీలో పుష్కలంగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ నమ్మకం, ఆత్మవిశ్వాసం మాత్రం వేరే లెవెల్...
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో ఎన్ని లోపాలు ఉన్నా, తనను తాను మార్చుకోవడానికి అతను సిద్దమయ్యాడు. 2010 తర్వాత అతని బ్యాటింగ్ చాలా మారింది. ఎంతో కష్టపడ్డాడు. బెటర్ క్రికెటర్‌గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాడు.
sachin kohli
అన్నింటికీ మంచి ఫిట్‌నెస్‌పైన చాలా ఫోకస్ పెట్టాడు. భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ లెవెల్స్ పెంచిన ఘనత మాత్రం విరాట్ కోహ్లీకే దక్కుతుంది. సచిన్ టెండూల్కర్ టెక్నిక్, టాలెంట్ వేరు. విరాట్ కోహ్లీ కూడా తాను సచిన్‌తో సరిపడనని ఒప్పుకుంటాడు..
sachin kohli
సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ స్థాయిలో వసీం అక్రమ్, వకార్ యూనిస్, కౌంట్నీ వాల్ష్ వంటి దిగ్గజ బౌలర్లను తన 16వ ఏట సమర్థవంతంగా ఎదుర్కోగలిగాడు.
24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడి, 30 వేలకు పైగా పరుగులు చేశాడు. అందుకే సచిన్ స్థాయి వేరు. విరాట్ కోహ్లీ ఈ తరంలో బెస్ట్ ప్లేయర్ కానీ సచిన్‌తో సమానం కాదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్..