- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీలో నన్ను, నేను చూసుకుంటా... అందుకే అతనంటే అంత ఇష్టం! వెస్టిండీస్ లెజెండ్ వీవ్ రిచర్డ్స్...
విరాట్ కోహ్లీలో నన్ను, నేను చూసుకుంటా... అందుకే అతనంటే అంత ఇష్టం! వెస్టిండీస్ లెజెండ్ వీవ్ రిచర్డ్స్...
క్రికెటర్లకు అభిమానులు ఉంటారు. మరికొందరు స్టార్ క్రికెటర్లకు క్రికెటర్లే అభిమానులవుతారు. అయితే లెజెండరీ క్రికెటర్లనే తన అభిమానులుగా మార్చుకున్న ఘనత మాత్రం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి అతి కొద్ది మంది ప్లేయర్లకు మాత్రమే దక్కుతుంది..

Image credit: PTI
విరాట్ కోహ్లీకి ఆటకు అభిమానులమయ్యామంటూ పాక్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిదీ, ఇంజమామ్ వుల్ హక్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వంటి ప్లేయర్లు ఎప్పుడో ప్రకటించారు. తాజాగా వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్ కూడా కోహ్లీ అభిమానినంటూ ప్రకటించుకున్నాడు..
Image credit: KCA
వన్డే, టీ20ల్లో 50కి పైగా యావరేజ్ కలిగిన విరాట్ కోహ్లీ, టెస్టుల్లో 49.29 సగటుతో పరుగులు చేశాడు. లాక్‌డౌన్ తర్వాత మూడేళ్ల పాటు పరుగులు చేయడానికి ఇబ్బంది పడినప్పటికీ అత్యంత వేగంగా 76 సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ..
25 వేల పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసి, ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేట్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు..
తాజాగా ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ సర్ వీవ్ రిచర్డ్స్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..
‘క్యారెక్టర్. నిలకడైన పర్ఫామెన్స్... ఆవేశం. కోపం.. ఇవన్నీ వీవిన్ రిచర్డ్స్‌ని విరాట్ కోహ్లీకి దగ్గర చేశాయి. అతను ఆటలో నూటికి 200 శాతం పెడతాడు. ఆ ప్యాషన్ నన్ను అతని ప్రేమలో పడేసింది..
ఆట కోసం అంతలా పరితపించే ప్లేయర్‌ని ఎవరు మాత్రం ఇష్టపడరు? అతను నమ్మిన ప్రతీ దాన్ని కచ్ఛితంగా చేయాలని అనుకుంటాడు. నేను ఏదైనా చేయగలనని తన సత్తాపై పూర్తి భరోసా పెడతాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ విరాట్‌లో ఆ ఫైర్ కనిపిస్తూ ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్..