MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ అందరికీ సమాధానం చెబుతాడు... ఈసారి డబుల్ కాదు, త్రిబుల్ సెంచరీతోనే వస్తాడు...

విరాట్ అందరికీ సమాధానం చెబుతాడు... ఈసారి డబుల్ కాదు, త్రిబుల్ సెంచరీతోనే వస్తాడు...

ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్‌ను తెగ ఇబ్బంది పెడుతున్న విషయం ఒక్కటే... కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్. 2019 వరకూ ఎక్కడా ఆగకుండా, రన్ మెషిన్‌లా పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు సెంచరీ మార్కు అందుకోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 16 2021, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

గత దశాబ్దంలో 20 వేల పరుగులు సాధించి, అసాధ్యమైన రికార్డును కొల్లగొట్టి... ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేట్’గా నిలిచాడు విరాట్ కోహ్లీ...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

ఈసారి ఫామ్ అందుకుంటే... మునుపటి కంటే వేగంగా మూడు ఫార్మాట్లలోనూ పరుగులు చేస్తాడని అంటున్నాడు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్...

39

‘విరాట్ కోహ్లీపై కెప్టెన్సీ ప్రెజర్ ఏ మాత్రం లేదు. ఎందుకంటే అతనికి కెప్టెన్సీ కొత్తేమీ కాదు. కెప్టెన్‌గా రాణిస్తూనే, బ్యాటుతో రికార్డు స్థాయిలో పరుగులు చేశాడు...

49

ఇప్పుడు విరాట్ కోహ్లీపై కెప్టెన్సీ భారం ఉందని మాట్లాడుతున్నవాళ్లు, కెప్టెన్‌గా విరాట్ చేసిన పరుగుల గురించి మరిచిపోయారు. ప్రతీ క్రికెటర్ కెరీర్‌లో ఇలాంటి స్థితి సర్వసాధారణం...

59

కోహ్లీ ఇప్పుడు అలాంటి స్టేజ్‌లోనే ఉన్నాడు. అతనిలో చాలా పరిణితి వచ్చింది. ఇంతకుముందులా ఆవేశపడడం లేదు. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నాడు...

69

ఇప్పుడు అతను ఫామ్‌లోకి వస్తే... ఇంతకుముందులా సెంచరీలు, డబుల్ సెంచరీలతో ఆగడు. త్రిబుల్ సెంచరీలు కూడా ఈజీగా బాదగలడు... త్వరలోనే మనం విరాట్ కోహ్లీ ఫామ్‌ను చూస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్...

79

రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్‌కప్ తర్వాత వన్డే, టీ20ల్లో కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి...

89

టీ20, వన్డే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించి, టెస్టుల్లో మాత్రమే కెప్టెన్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ మాత్రం ఆ వార్తలను కేవలం పుకార్లంటూ కొట్టిపారేసింది...

99
Virat Kohli

Virat Kohli

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా ఫలితం ఎలా ఉన్నా, మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీయే కెప్టెన్‌గా కొనసాగుతాడంటూ తేల్చి చెప్పేశాడు బీసీసీఐ ట్రెజరర్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: సూర్యకు షాక్.. అయ్యర్ కాదు.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజూ? సెలక్టర్ల ప్లాన్ ఇదే!
Recommended image2
5 Most Dangerous Batsmen: క్రికెట్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్లు వీరే.. క్రీజులోకి వస్తే బౌలర్లకు వణుకే!
Recommended image3
IPL ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ఉర్విల్‌ పటేల్‌ సునామీ ఇన్నింగ్స్ తో లక్నో ను దెబ్బకొట్టిన చెన్నై
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved