MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మరో సంచలన నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ... ఆర్‌సీబీ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై...

మరో సంచలన నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ... ఆర్‌సీబీ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్‌గా తప్పుకున్న విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు కూడా ప్రకటించాడు. ఐపీఎల్ 2021 సీజన్, ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఆఖరి సీజన్ అని ప్రకటించాడు.

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 19 2021, 10:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

‘ఇది ఆర్‌సీబీ కెప్టెన్‌గా నా ఆఖరి సీజన్. నా ఆఖరి ఐపీఎల్ గేమ్ వరకూ నేను ఆర్‌సీబీ ప్లేయర్‌గానే ఉంటాను. ఆర్‌సీబీ అభిమానులు నా నిర్ణయాన్ని గౌరవిస్తారని నమ్ముతున్నా...’ అంటూ వీడియో సందేశం ద్వారా ప్రకటించాడు విరాట్ కోహ్లీ..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

ఈ ఏడాది విరాట్ కోహ్లీకి ఆర్‌సీబీ కెప్టెన్‌గా 9వ సీజన్. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కి కెప్టెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ కెప్టెన్‌గా కూడా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు...

310

టీ20ల్లో కెప్టెన్‌గా అద్భుతమైన విజయాలు అందించినప్పటికీ, విరాట్ కోహ్లీపై విమర్శలు రావడానికి ప్రధాన కారణం ఐపీఎల్... ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా ఏ మాత్రం సరైన రికార్డు లేకపోవడమే...

410

2008 నుంచి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. 14 సీజన్లుగా ఒకే టీమ్‌కి ఆడుతున్న ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీయే...

510

అయితే ఇప్పటికే టీమ్ లోగో మార్చినా, జెర్సీ రంగులు మార్చినా, స్పాన్సర్లనీ, కోచ్‌లను... ప్లేయర్లను మార్చినా ఆర్‌సీబీకి మాత్రం లక్ కలిసి రావడం లేదు...

610

2009లో ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత 2011, 2016 సీజన్లలో ఫైనల్‌కి అర్హత సాధించినా టైటిల్ మాత్రం గెలవలేకపోయింది...

710

కెప్టెన్‌గా 2013 సీజన్ నుంచి పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ... ఆర్‌సీబీ తరుపున 131 మ్యాచులు ఆడాడు. ఇందులో 60 విజయాలు దక్కగా, 64 పరాజయాలు దక్కాయి...

810

2016 సీజన్‌లో బ్యాటింగ్‌తో అద్భుతంగా పోరాడి, నాలుగు సెంచరీలతో 900+ పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2017, 2019 సీజన్లలో ఆఖరి స్థానంలో నిలిచింది ఆర్‌సీబీ...

910

8 సీజన్లలో ఒక్క టైటిల్ గెలవలేకపోవడంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో రోహిత్ శర్మ ఐదు టైటిల్స్ గెలవడంతో అతనిపై ట్రోలింగ్ మరింతగా పెరిగింది...

1010

ఈ సారి టైటిల్ వచ్చినా, రాకపోయినా వచ్చే సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే ఆఖరి సీజన్ కానుంది...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ఉర్విల్‌ పటేల్‌ సునామీ ఇన్నింగ్స్ తో లక్నో ను దెబ్బకొట్టిన చెన్నై
Recommended image2
Vaibhav Sooryavanshi : సచిన్, కోహ్లీ వల్ల కాలేదు.. 15 ఏళ్ల కుర్రాడు వరల్డ్ రికార్డ్ కొట్టాడు!
Recommended image3
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్ వరల్డ్ కప్ సమరానికి డేట్ ఫిక్స్.. దాయాదుల ఫైట్ మామూలుగా ఉండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved