- Home
- Sports
- Cricket
- ఉమ్రాన్ మాలిక్ చాలా రేర్ టాలెంట్! కాపాడుకోవాలి... టీమిండియాకి గ్లెన్ మెక్‌గ్రాత్ సలహా...
ఉమ్రాన్ మాలిక్ చాలా రేర్ టాలెంట్! కాపాడుకోవాలి... టీమిండియాకి గ్లెన్ మెక్‌గ్రాత్ సలహా...
భారత స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్. ఐపీఎల్ 2021 ద్వారా వెలుగులోకి వచ్చి, ఐపీఎల్ 2022లో అందరి దృష్టిని ఆకర్షించి టీమిండియాలోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్‌ని భారత కెప్టెన్లు సరిగ్గా వాడుకోలేకపోయాడు. ఫలితంగా కొన్ని మ్యాచులకే ఉమ్రాన్ మాలిక్, టీమిండియాలో చోటు కోల్పోయాడు...

‘ఉమ్రాన్ మాలిక్ చాలా రేర్... అతని షీర్ పేస్ చాలా విభిన్నమైంది. 150+ కి.మీ.ల వేగంతో బంతులు వేసే బౌలర్‌కి ప్రత్యేకంగా నేర్పించాల్సింది ఏమీ ఉండదు. అయితే చాలా మంది బౌలర్లు, తమ వేగాన్ని తగ్గించుకుంటూ ఉంటారు...
Image credit: PTI
పేస్ వేగాన్ని తగ్గించుకోవడానికి గంటలు గంటలు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుంటారు. వేగమే తమ బలమైనప్పుడు దాన్ని తగ్గించుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. 150+ వేగంతో బంతులు వేసే బౌలర్ దొరకడం ఏ జట్టుకైనా అదృష్టమే...
Image credit: Getty
వికెట్లు తీయడానికి బౌలింగ్ వేగాన్ని కంట్రోల్ చేసుకోవడం అనే ఫార్ములా ఏ మాత్రం కరెక్ట్ కాదు. చాలామంది పేసర్లు 150+ స్పీడ్ అందుకోవడానికి అష్టకష్టాలు పడుతూ, అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అలాంటిది సహజంగానే 150+ వేగం అందుకునే బౌలింగ్ స్టైల్ ఉండడం చాలా అరుదైన ప్రత్యేకత...
కాబట్టి ఉమ్రాన్ మాలిక్‌ని సరిగ్గా వాడుకోకపోయినా పర్లేదు, అతన్ని మార్చేపని మాత్రం చేయకండి. ముఖ్యంగా అతని బౌలింగ్ స్పీడ్‌ని తగ్గించకండి. అతని పేస్ అద్భుతం...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్...
చెన్నైలో ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న గ్లెన్ మెక్‌గ్రాత్, ఈ ఏడాదిలో మూడు సార్లు భారత్‌లో పర్యటించబోతున్నట్టు తెలియచేశాడు. తన అకాడమీ ద్వారా మెరుగైన ఫాస్ట్ బౌలర్లను తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపాడు మెక్‌గ్రాత్...